55 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా టెస్ట్ !

Update: 2020-04-22 23:30 GMT
కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తుంది. రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా ను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉండటంతో అందరిలో ఆందోళనలో మొదలైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా మృతుల్లో 55-80 ఏళ్లలోపు వారే అధికంగా ఉంటున్నందున ..రాష్ట్రంలో 55 ఏళ్లు వయస్సు పై బడిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ,  వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ తెలిపారు. మంగళవారం బెంగళూరు లో ఆయన మీడియా తో మాట్లాడుతూ 55 ఏళ్లు పైబడినవారు స్వల్పం గా శ్వాసకోశ సమస్య ఉన్నా, వెంటనే ప్రత్యేక ఆస్పత్రికి వచ్చి కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా భారిన పడి మృతి చెందిన వారంతా కూడా చివరి క్షణంలో ఆస్పత్రికి వచ్చినవారేనని, అందుకే వారిని కాపాడలేకపోయాం అని  -శ్వాసకోశ - కిడ్నీ - హృద్రోగం - కేన్సర్‌ - హెచ్‌ ఐవీ - టీబీ - మధుమేహం ఉన్నవారిని రక్షించుకోవాల్సిన బాధ్యత అం దరిపైనా ఉందన్నారు. అలాగే ల్యాబ్‌ లలో కరోనా నిర్దారణ పరీక్షలు జరగడం లేదనే ఆరోపణలు నిజం కాదు అని , రోజుకు 2 వేల మం దికిపైగా పరీక్షలు జరుపుతున్నామని, ఈనెలాఖరుకు మరో 10 ల్యాబ్‌ లు, మే చివరినాటికి జిల్లాకు రెండు చొప్పున రాష్ట్రంలో 60 ల్యాబ్‌ లు  ఏర్పాటు చేయబోతున్నట్టు అయన తెలిపారు.
Tags:    

Similar News