కార్పొరేట్...కార్పొరేట్ ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కావాలన్నా కూడా కార్పొరేట్ సంస్థలే దిక్కు అయ్యేలా చేసేశారు. అందరి వాడకం కూడా అలాగే తయారైంది. ఇతర వస్తువుల దగ్గర ఎలా ఉన్నా కూడా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కి వచ్చే పేషేంట్స్ వద్ద కూడా కార్పొరేట్ పేరుతో దోచేస్తున్నారు. ఆస్పత్రుల్లో బేరం మాట్లాడలేరు .. దీన్ని ఆసరాగా తీసుకోని బ్రాండెడ్ పేరుతో మందుల ధరలు ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తూ, రోగుల , వారి కుటుంబాల నడ్డి విరుస్తున్నారు. తక్కువ ధరకు జనరిక్ మందులు దొరుకుతున్నా వాటి జోలికెళ్లకుండా అధిక ధరలుండే మందులు రాస్తూ దోచుకుంటున్నాయి. ఓ ఆస్పత్రిలో ఎక్కువ బిల్లు వేస్తున్నారని మరో ఆస్పత్రికి వెళితే ఆ ఆస్పత్రిలోనూ దీనికి మించి బిల్లులు వేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కరోనా సమయంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరిగిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. పలు మీడియాల్లో కూడా దీనిపై పలు రకాల కథనాలు కూడా వచ్చాయి. కరోనా విజృంభణ సమయంలో రెండు , మూడు రోజులకే లక్షల్లో బిల్లులు వేసిన హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి.
ఎదో కొద్దిగా జ్వరం వచ్చి ఆస్పత్రిలో చేరినా రెండ్రోజులు ఇంపేషెంట్ గా ఉంటే చాలు కనీసం రూ.లక్షయినా బిల్లు చెల్లించకుండా బయటకు రాలేని పరిస్థితి. బయట రూ.10కి దొరికే టాబ్లెట్ ఆస్పత్రిలో రూ.100కు అమ్ముతున్నారు. మందుల్ని బయట కొనుక్కోనివ్వరు. ఆస్పత్రిలో ధర తగ్గించరు. నర్సింగ్ హోం నుంచి కార్పొరేట్ ఆస్పత్రి వరకూ అన్నిచోట్లా భారీ దోపిడీతో పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్ధికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. బ్రాండెడ్ మందుల స్థానంలో చాలారకాల మందులు జనరిక్ లో వచ్చాయి. ఈ మందులు రాస్తే 70 నుంచి 80 శాతం ధర తగ్గుతాయి. కానీ జనరిక్ మందులు రాసే ప్రైవేటు డాక్టర్లే లేరు. బ్రాండెడ్ మందులను ఆయా కంపెనీల నుంచి అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసి ఎంఆర్ పీ ని అడ్డం పెట్టుకుని విక్రయిస్తున్నారు. ఎంఆర్ పీ ధరకూ.. కొనుగోలు చేసిన ధరకూ కొన్ని మందుల విషయంలో 200 శాతం కూడా తేడా ఉంటోంది. జనరిక్ మందులు రాయాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలిచ్చినా డాక్టర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలో క్యాన్సర్ తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రైవేట్ ఆస్పత్రులు జనరిక్ మందులను వాడి బాధితులకు కాస్త ఉపశమనం కలిగించవచ్చు. కానీ బ్రాండెడ్ ధర పేరుతో వారిని మరింత ఆర్ధికంగా చికితిపోయేలా చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితిల్లోనూ జనరిక్ మందులు రాయకపోగా, బ్రాండెడ్ ధరల్లో ఒక్క పైసా తగ్గించడం లేదు. మందుల ధర తగ్గించడం కేంద్ర ప్రభుత్వమే నియంత్రించాలి. తయారీదారు, రిటైల్ అమ్మకందారు, కార్పొరేట్ ఆస్పత్రుల మార్జిన్లను దృష్టిలో ఉంచుకుని ఎన్‌పీపీఏ (నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ)లోకి తీసుకురావాలి. ఒకప్పుడు రూ.1.50 లక్షలున్న స్టెంట్‌ను రూ.25 వేలకు తగ్గిస్తే దిగొచ్చారు. ఇప్పుడు ప్రాణాధార మందుల ధరలను తగ్గించి విధిగా నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. జనరిక్ మందులు రాయాలని వైద్యులకు చెబుతున్నాం. జనరిక్ రాసి కనీసం బ్రాకెట్‌లో వారు సూచించే బ్రాండ్ అయినా రాస్తే అవగాహన వస్తుందని చెప్పాం అని ఏపీ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ బి.సాంబశివారెడ్డి తెలిపారు.