పార్లమెంటులో తాజా నిషేధ పదాలు.. సిగ్గుచేటు.. మోసం.. అవినీతి.. అహంకారి.. పిరికివాడు
రోజులు గడుస్తున్న కొద్దీ ఆర్థిక విధానాలు మరింత సరళతరంగా ఉండాలి. రాజకీయాలు.. పాలనా విధానాల్లోనూ మరింత పరిణితి ఉండాలి. అందుకు భిన్నంగా కాలం గడిచే కొద్దీ పరిమితులు అంతకంతకూ పెరగటం ఏ మాత్రం సబబు కాదు. ఇప్పుడు చూస్తుంటే.. మనం ముందుకు వెళుతున్నామా? వెనక్కి పోతున్నామా? అన్న సందేహం కలుగక మానదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన పార్లమెంటు సమావేశాల సందర్భంగా.. సభలోని సభ్యులు ఏమేం పదాలు వాడకూడదన్న దానికి సంబంధించిన జాబితాను సిద్ధం చేయటం తెలిసిందే.
ఇప్పటివరకు ఉన్న నిషేధిత పదాలకు అదనంగా తాజాగా మరికొన్ని పదాల్ని జోడించిన తీరు చూస్తే.. విస్మయానికి గురి కాక మానదు. అధికారపక్షాన్ని ప్రశ్నించే వేళలో.. పవర్ లో ఉన్న వారిపై విమర్శలు చేసే సమయంలో కొన్ని ఘాటు పదాల్ని వినియోగిస్తుంటారు విపక్ష నేతలు.
అలాంటి వాటిని నిషేధిత జాబితాలో చేర్చటంతో పాటు.. సర్వసాధారణంగా.. ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేని కొన్ని పదాల్ని సైతం ముందుచూపుతో బ్యాన్ చేసిన వైనం చూస్తే నోటి వెంట మాట రాని పరిస్థితి.
మరో మూడు రోజుల్లో (జులై 18న) పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభ్యులు వినియోగించకూడని పదాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అందులో ఉన్న కొన్ని పదాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నాయి.
సర్వసాధారణంగా అందరూ వినియోగించే కొన్ని పదాలపై ఎలా నియంత్రణ విధిస్తారు? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా విడుదల చేసిన ఈ పదాలపై పలువురు విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన నిషేధిత పదాలను ఎవరైనా సభ్యులు సభలో తమ ప్రసంగం సందర్భంగా వినియోగిస్తే వాటిని అమర్యాదకరమైన పదాలుగా భావిస్తారు. అలాంటి పదాలు వాడిన సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్.. లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకోవటానికి అవసరమైన తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. అదే సమయంలో రికార్డుల నుంచి తొలగిస్తారు. తాజాగా విడుదలైన నిషేధిత జాబితాలో పేర్కొన్న పదాల్ని చూస్తే..
- దాదాగిరి
- పిరికివాడు
- విశ్వాసఘాతకుడు
- సిగ్గుచేటు
- వేధింపులు
- మోసం
- అవినీతి
- అసమర్థుడు
- శకుని
- తానాషా
- గూండాలు
- ద్రోహ చరిత్ర
- చీకటి రోజులు
- అహంకారి
- తానాషా
- వినాశ్ పురుష్
- ఖలిస్థానీ
- చంచా
- చంచా గిరి
- మొసలి కన్నీళ్లు
- క్రిమినల్
- గాడిద