అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే శాఖ అంటే ఏదంటే మొదట రెవెన్యూ.. ఆ తర్వాత రవాణా శాఖ పేరే వినిపిస్తుంది. తెలంగాణలో రవాణా శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ఇన్నాళ్లు ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతుండగా తాజాగా ఉద్యోగుల వద్ద కూడా వసూళ్ల కు పాల్పడుతున్నారు. అయితే అది ఎందుకంటే ఉద్యోగుల పోస్టింగ్ కు సంబంధించిన అంశంలో అధికారులు అవినీతి కి తెర లేపుతున్నారు. ఎవరు ఎంత ఇచ్చుకుంటే అంత మంచి స్థానంలో పోస్టింగ్ ఇచ్చేందుకు అధికారులు వ్యవహారం నడుపుతున్నట్లు బహిర్గతమైంది.
రాష్ట్ర రవాణా శాఖ లో ఎంవీఐ పోస్టింగ్‌ల వ్యవహారం ప్రహసనంగా మారింది. ఎవరికి ఇష్టమైన చోట వారు పోస్టింగ్ వేయించుకునేందుకు ఈ దందాకు తెరలేపారు. ఎక్కడ మొత్తంలో ఎక్కువ అదనపు రాబడి వస్తుందో అక్కడ పోస్టింగ్ కోసం ఖర్చు చేస్తున్నారు. వీటిలో చెక్‌పోస్టు ల వద్ద పోస్టింగ్ కోసం ఎంవీఐలు పోటీ పడుతున్నారు. దాని కోసం భారీగా చెల్లించుకుంటున్నారు. దీనికి ‘అదర్ దేన్ డ్యూటీ (ఓడీ)’ లేదా ‘ఇన్‌చార్జి’ లేదా ‘డిప్యూటేషన్’ అని పేర్లు పెట్టి పోస్టింగ్ లు ఇస్తున్నారు.
దీనికి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కమిషనరేట్‌లోని ఓ అధికారి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. రవాణా శాఖలో మొత్తం 141 మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) పోస్టులు ఉన్నాయి. వీటిలో కేవలం 60 మందే పని చేస్తున్నారు. 199 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టులకు 19 ఖాళీగా ఉన్నాయి. ఎంవీఐ పోస్టులు 81 ఖాళీగా ఉండడం తో 60 మందినే అంతటా సర్దుతున్నారు. దీంతో ఒక్కొక్కరికి రెండేసి చోట్ల పోస్టింగ్ ఇస్తూ నడిపిస్తున్నారు.
ఈ సమయంలో మంచి రాబడి వచ్చే స్థానానికి ఎంవీఐలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో ‘రాబడి’ రాకుంటే.. భారీగా వసూళ్లయ్యే ప్రదేశంలో డిప్యూటేషన్ పై వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. లేదంటే ఇన్‌చార్జి అని ముద్దు పేరు పెడుతున్నారు. రవాణా చెక్ పోస్టుల్లో ‘అక్రమ సంపాదన’ ఎక్కువ ఉంటుండడంతో ఎంవీఐలు, ఏఎంవీఐలు పోటీ పడి పోస్టులు వేయించుకుంటున్నారు. దీనికి కమిషనరేట్ లోని ‘అధికారి’కి అడిగినంత ఇచ్చుకుంటున్నారు.
- ఆసిఫాబాద్‌లో పని చేసే ఒక ఎంవీఐని అతి కీలకమైన ఆదిలాబాద్ చెక్‌పోస్టుకు ఇటీవల డిప్యూటేషన్ పై పంపించారు.
- భూపాల పల్లిలో ఉన్న మరో ఎంవీఐకి కూడా ఆదిలాబాద్ చెక్‌పోస్టులో డిప్యూటేషన్ ఇచ్చారు.
- సాలూరలో ఏఎంవీఐకే ఎంవీఐ గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ 9 మంది ఏఎంవీఐలు ఉండగా.. ఎంవీఐ ఇన్‌చార్జి పోస్టు కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. దీని కోసం ‘వేలంపాట’ కూడా నడిపినట్లు తెలుస్తోంది.
- బండ్లగూడ ఎంవీఐకి టోలిచౌక్ ఎంవీఐగా ‘ఆన్‌డ్యూటీ’ ఇచ్చారు. ఆదిలాబాద్ డీటీసీకి కరీంనగర్ డీటీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఈ అధికారి ఓ సంఘం నేత కావడం తో కరీంనగర్ పోస్టు ను ఆయన కోసమే ఖాళీగా చూపిస్తూ.. ఇన్‌చార్జిగా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. సంగారెడ్డిలో ‘భారత్ స్టేజ్-3’ వాహనాల రిజిస్ట్రేషన్లలో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారికి ఇటీవల ఓ జిల్లా ఉన్నతాధికారిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ చెక్‌పోస్టులో ఒక ఎంవీఐ 15 ఏళ్లుగా కొనసాగుతున్నాడు. 60 మంది ఎంవీఐల్లో 50 మంది వరకు డిప్యూటేషన్లు, ఇన్‌చార్జిలు, ఓడీల పేర పని చేస్తున్నారని సమాచారం. ఏఎంవీఐలు కూడా సగం మంది వరకు ఇలాంటి పోస్టింగుల్లోనే ఉన్నారు.ఈ విధంగా రాష్ట్రంలోని కీలకమైన సాలూర, ఆదిలాబాద్ (భోరజ్), అలంపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్ వద్ద భారీగా రాబడి వస్తుండడంతో ఇక్కడ పోస్టింగ్ కోసం ఏఎంవీఐ, ఎంవీఐ తదితర అధికారులు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ఇక్కడ ఏసీబీకి పలువురు అధికారులకు పట్టుబడినా రాబడి బాగుండడంతో వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
అంతా ఆ అధికారి కన్నుసన్నల్లో.. అక్రమ డిప్యూటేషన్ల లో రవాణా శాఖ కార్యాలయంని ఓ అధికారి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. అతడిని కలిసి చెల్లించుకుంటే మంచి డిమాండ్ ఉన్న స్థానాలకు బదిలీ లేదా, డిప్యూటేషన్ పై వెళ్తున్నారు. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆ అధికారి కావడంతో ఇది చేస్తుండడంతో అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.