అందరికి అలవాటైన రెగ్యులర్ ఎన్నికలకు పూర్తి భిన్నం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక. ఓటు వేసే ఓటర్లు మొదలు.. ఓట్ల లెక్కింపు వరకు అంతా భిన్నంగా ఉంటుంది. మిగిలిన ఎన్నికల్లో మాదిరి స్వల్ప అధిక్యతతో బయటపడే అవకాశమే ఉంటుంది. రెగ్యులర్ ఎన్నికల్లో వంద ఓట్లు పోలై.. 90 ఓట్లు చెల్లుబాటు అయితే..ఎక్కువ ఓట్లతో పోటీ పడే ఇద్దరు అభ్యర్థుల్లో ఒక్క ఓటు అధికంగా వచ్చినా గెలుపు వారిని వరిస్తుంది. కానీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇందుకు విరుద్ధం. పోటీ పడే ఇద్దరు అభ్యర్థుల్లో గెలవాల్సిన అభ్యర్థికి కచ్ఛితంగా 50 శాతం + 1 ఓటు తప్పనిసరి అవసరం.
మరింత వివరంగా చెప్పాలంటే 10 ఓట్లు పోల్ అయ్యాయని అనుకుందాం. అందులో పోలైన ఓట్లు 9 అనుకుందాం. బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉందామని అనుకుందాం. గెలవాల్సిన అభ్యర్థికి 5 ఓట్లు తప్పనిసరి. మరి.. విజేతగా నిలిచిన అభ్యర్థికి నాలుగు ఓట్లు.. రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి మూడు ఓట్లు వచ్చాయని అనుకుందాం. మరి.. విజేతగా కావటానికి అవసరమైన ఓట్లను.. మిగిలిన అభ్యర్థులకు పడిన ఓట్లలో మొదటి.. రెండు స్థానాల్లో ఉన్న వారికి సదరు ఓటరు ఇచ్చిన ప్రాధాన్యత ఆధారంగా గెలుపును డిసైడ్ చేస్తారు.
కన్ఫ్యూజింగ్ గా ఉందా? మరింత క్లియర్ గా చెప్పాలంటే.. పైన చెప్పినట్లుగా నాలుగు ఓట్లు పడిన అభ్యర్థికి.. మిగిలిన అభ్యర్థులకు పడిన ఓట్లలో ఓటర్లు తమ రెండో ప్రాధాన్యత ఓటును నాలుగు ఓట్లు పడిన అభ్యర్థికి కాకుండా.. మూడు ఓట్లు పడిన అభ్యర్థికి ఇస్తే.. రెండో ప్రాధాన్యత ఓట్ల కింద ఆయన్నే విజేతగా నిర్ణయిస్తారు. నల్గొండతో పోలిస్తే.. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నిక ఓట్ల లెక్కింపు పోటాపోటీగా ఉంది. హైదరాబాద్ స్థానానికి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి వాణీ దేవికి.. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు మధ్య ఓట్లు వ్యత్యాసం స్పలంగా ఉంది. ఇలాంటివేళ.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వస్తుంది. అదే జరిగితే.. టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. టీఆర్ఎస్ కు ఓటు వేసిన వారు బీజేపీకి కచ్ఛితంగా ఓటు వేయరు. కానీ.. బీజేపీకి ఓటు వేయకుండా మిగిలిన వారికి ప్రధమ ప్రాధాన్యత ఓటు వేసినోళ్లలో చాలామంది తమ రెండో ప్రాధాన్య ఓటును బీజేపీకి వేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. టీఆర్ఎస్ కు షాక్ తప్పదన్న మాట వినిపిస్తోంది.