ప్రపంచాన్ని ఆవహించిన కరోనా మహమ్మారికి మందే లేదు. దీంతో ప్రపంచమంతా మరణ మృదంగం వినిపిస్తోంది. రోగ నిరోధక శక్తి లేనివారు పిట్టల్లా రాలిపోతున్నారు. టీకా వస్తే తప్ప దీని నుంచి ప్రపంచం బయటపడడం అసాధ్యం. ఇప్పటికే అన్ని దేశాల వారు టీకాలు తయారు చేసే పనిలో పడ్డారు.
ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తయారీలో అమెరికా, రష్యా, బ్రిటన్ దేశాలు ముందున్నాయి. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తయారు చేసిన టీకా మూడో దశ మానవ ప్రయోగాలు ఈనెల 27నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ తయారు చేస్తామని ఆ కంపెనీ చెబుతోంది.
ఇక ప్రఖ్యాత బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కూడా అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ తెస్తామని అంటోంది. రష్యా మాత్రం ఆగస్టు రెండో వారం వరకే కరోనా టీకాను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది.
రష్యాలోని సెషనోవ్ యూనివర్సిటీ అన్ని దశల్లో పరీక్షలు పూర్తయ్యాయని.. మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నది. దీంతో అమెరికా, బ్రిటన్ కంటే ముందుగానే రష్యా నుంచి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుందని అర్థమవుతోంది.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వచ్చే ఏడాది వరకు వ్యాక్సిన్ రాదని అంటోంది. అయితే ఏదేశం ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ తయారు చేసినా దానికి విపరీతమైన డిమాండ్.. కాసుల వర్షం కురుస్తుంది. అందుకే ప్రపంచదేశాలు పోటీపడుతున్నాయి.