హైదరాబాద్ మహానగరంలో సంపన్నులు ఉండే ప్రాంతాల్లో ఫిలింనగర్ ఒకటి. అలాంటి చోట ఖరీదైన ఇంటిని అద్దెకు తీసుకున్న భార్యభర్తలు ఇద్దరు చేసే బిజినెస్ గుట్టు రట్టు కావటమే కాదు.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి చేసే ఈ బిజినెస్ గురించి తెలిసిన వారంతా షాక్ తినే పరిస్థితి. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులో తీసుకున్న ఈ భార్యభర్తల వ్యవహరం ఇప్పుడు అధికారవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
37 ఏళ్ల షేక్ ఫహద్ అలియాస్ మదన్.. ఆయన భార్య 27 ఏళ్ల సలీమా రబ్బాయి షేక్ లు ఇద్దరూ ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వచ్చారు. తేలిగ్గా డబ్బులు సంపాదించటానికి వీలుగా వ్యభిచార వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఈ బిజినెస్ ను చూసేది. విటులకు అవసరమైన సదుపాయాల్ని కలుగజేసే ఈ భార్యభర్తలు.. వ్యభిచారం కోసం వచ్చే వారు డ్రగ్స్ వినియోగించటాన్ని గమనించారు.
ఆ వ్యాపారం కూడా చేస్తే మరింతగా సంపాదించొచ్చన్న ఆలోచనతో అమ్మాయిలతో పాటు.. డ్రగ్స్ ను తమ కస్టమర్లకు అందించేవారు. జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్ లో వ్యభిచారం నిర్వహించే అతగాడి మీద 2018లో కేసు నమోదైంది. దీంతో తన మీద పడిన అధికారుల కన్ను నుంచి తప్పించుకునేందుకు తన మకాంను ఫిలింనగర్ లోకి వచ్చారు. ఒక ఖరీదైన ఇంటిని అద్దెకు తీసుకున్న అతడు.. కింద పోర్షన్ లో తాము ఉంటే.. పై పోర్షన్ లో విటులకు అనువుగా మార్చారు. నెలకు రూ.75వేల చొప్పున అద్దెకు ఇంటిని తీసుకోవటం గమనార్హం.
వ్యభిచారం కోసం వచ్చే వారికి అవసరమైన డ్రగ్స్ ను నైజీరియన్స్ నుంచి కొనుగోలు చేసేవాడు. గ్రాము కొకైన్ ను రూ.6వేలకు కొనుగోలు చేసి కస్టమన్లకు రూ.7,500 అమ్మేవాడు. ఇతడి భార్య తాను చేసే వ్యాపారాన్ని సాయం చేస్తున్నట్లు అధకిఆరులు గుర్తించారు. తాజాగా అందిన సమాచారం మేరకు బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 లోని సాయిబాబా గుడి దగ్గర కొకైన్ అమ్మకం జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు.. పక్కాగా ప్లాన్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నగదు.. కార్లు.. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. భర్త దారి తప్పితే భార్య సరిచేసే ప్రయత్నం ఇన్నాళ్లు చూశాం. అందుకు భిన్నంగా డబ్బు కోసం భార్యభర్తలు ఇద్దరూ కలిసి చేసే ఈ దుర్మార్గ వ్యాపారాన్ని చూసిన అధికారుల నోట మాట రాని పరిస్థితి.