జంట‌ను అడ్డ‌గించి దారి దోపిడీ: ‌ధైర్య‌సాహ‌సాల‌తో కాపాడిన భార్య‌!

Update: 2020-07-10 18:30 GMT
క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ దంప‌తుల‌ను రోడ్డుపై ఇద్దరు యువకులు అడ్డగించి బెదిరింపుల‌కు పాల్ప‌డి దాడి చేసి ఆభ‌ర‌ణాలు.. న‌గదు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ దంప‌తులు దొంగ దొంగ అని కేకలు వేయ‌డంతో దొంగలు బైక్ స్టార్ట్ చేసి మ‌ళ్లీ కారును అడ్డగించి దాడికి పాల్ప‌డ్డారు. అయితే ఇక్క‌డ భార్య వారిని ప్ర‌తిఘ‌టించి వారి దాడి నుంచి భర్తను రక్షించుకుంది.

దానికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు భార్యాభ‌ర్త‌లు ప‌ని చేస్తున్నారు. వారిద్ద‌రూ క‌లిసి కారులో చిక్కమంగళూరు బయలుదేరాడు. హెబ్బల్ ఫ్లై ఓవర్ వద్దకు రాగానే దారిదోపిడీ దొంగలు ఇద్దరు యువకులను కత్తితో బెదిరించి విలువైన వస్తువులను లాక్కుంటున్నారు. దీన్ని ప‌రిశీలించిన ఈ దంప‌తులు దొంగ దొంగ అని కేకలు వేయ‌డంతో అది గమనించిన దోపిడీ దొంగలు బైక్ స్టార్ట్ చేసి కారు ముందుకు వచ్చి ఆపారు. కారు కదలనీయకుండా అడ్డుగా పెట్టారు. వారిలో ఒకరు కత్తితో డోర్ వద్దకు వచ్చి అత‌డితో గొడవపడ్డాడు. అతడి మెడలోని బంగారు గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ స‌మ‌యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్ప‌డింది. ఇది చూసిన భార్య భ‌య‌కంపితులైంది.

అయితే భ‌ర్త‌పై తల, మెడ, ముఖంపై దొంగ కత్తితో గాయాలు చేస్తుండ‌డంతో భార్య‌ ధైర్యం తెచ్చుకుని వారి నుంచి త‌ప్పించుకునేందుకు కారును ముందుకు నడిపింది. దొంగల బైక్‌ను ఢీకొని అక్క‌డి నుంచి ముందుకెళ్లింది. గాయ‌ప‌డిన భర్తను స‌మీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం కొడిగెహళ్లి పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News