లివింగ్‌ బంధంలో ఆమె భార్యేనా?

Update: 2015-04-13 08:52 GMT
ప్రాశ్చాత్య సంస్కృతితో వచ్చి పడిన మరో అలవాటు లివింగ్‌ రిలేషన్‌షిప్‌. పదేళ్ల కిందట కాస్త చిత్రంగా చూసే వారు కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నగరాలు.. పట్టణాల్లో ఇలాంటి బంధాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

మరి.. లివింగ్‌ రిలేషన్‌షిప్‌కు చట్టబద్ధత ఉందా? అంటే.. కలిసి ఉందొచ్చన్న దానిపై వ్యతిరేకించటం లేదు. మరి.. కలిసి ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం.. ఒకవేళ సదరువ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే పార్టనర్‌ మాటేమిటి? ఇలాంటి అంశాలపై క్లారిటీ లేదు.

తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇలాంటి సందేహాలకు సంబంధించి తాజాగా ఇచ్చిన తీర్పు ఒకటి ఆసక్తికరంగా మారింది. లివింగ్‌ రిలేషన్‌షిప్‌లో కలిసి ఉన్న పురుష.. స్త్రీల మధ్య బంధానికి కొత్త రూపునిచ్చింది. లివింగ్‌రిలేషన్‌షిప్‌లో ఉండే మహిళ.. సదరు వ్యక్తి భార్యగా భావించే వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భార్యగా పోల్చవచ్చని పేర్కొంది.

లివింగ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న వారిలో వ్యక్తి చనిపోతే.. అతడికి చెందిన ఆస్తికి వారసురాలిగా రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళకు దక్కే వీలు కల్పిస్తూ తీర్పునిచ్చింది. ఇప్పటివరకూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న మహిళకు మాత్రమే ఉన్న హక్కును.. లివింగ్‌ రిలేషన్‌షిప్‌ బంధంలోని మహిళ కూడా చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్య హోదాను పొందే అవకాశం ఉందని చెబుతూ.. మరణించిన వ్యక్తి ఆస్తికి వారసురాలిగా ఉండే వీలుందని పేర్కొంది. అయితే.. ఈ బంధానికి సంబంధించిన ఆధారాలు నమ్మదగినవిగా ఉండాలని పేర్కొంది.

Tags:    

Similar News