అద్దె ఇళ్ల కోసం వ‌చ్చి దోచుకెళ్తున్న దొంగ జంట‌!

Update: 2017-06-12 11:03 GMT
మీ వీధిలో అద్దెకు ఏమ‌న్నా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయా? ఎందుకైనా మంచిది. వాటిని చూసుకోవ‌డానికి వ‌చ్చేవారిపై ఓ క‌న్నేసి ఉంచండి. ఆ ఖాళీగా ఉన్న ఇళ్ళ‌ను చూడ‌డానికి వ‌చ్చి చుట్టుప‌క్క‌ల ఇళ్ల‌ను ఖాళీ చేసే దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌! ఈ త‌ర‌హా దొంగ జంట‌ను హైద‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

అంబర్ పేట శంకర్ నగర్ కు చెందిన ఒగ్గు శ్రీనివాస్. గతంలో ఓ కంపెనీలో పనిచేసేవాడు. అత‌డికి వివాహ‌మైంది. తాను ప‌నిచేస్తున్న కంపెనీలో పరిచయమైన రేణుకను రెండో పెళ్లి చేసుకొన్నాడు. ఆమె కూడా  ఓ ఇంట్లో పనిచేసేది. అత‌డి ప్రవర్తన సరిగా లేదని కంపెనీ నుంచి తీసేశారు.దీంతో ఆర్థిక సమస్యలను అధిగమించేందుకుగాను దొంగతనాలు చేయాలని ఫిక్స్ అయ్యారు.

వారిద్ద‌రూ పొద్దున్నే టిప్‌ టాప్‌ గా తయారై స్కూటీపై బయలుదేరేవారు.టులెట్ బోర్డులు ఉన్న ఇళ్ల‌ను ఎంచుకునేవారు. ఇంటికోసం వెతుకుతున్నామంటూ య‌జ‌మానుల‌ను న‌మ్మించేవారు. అంతేకాకుండా... చుట్టుప‌క్క‌ల ఇళ్లు, ఫ్లాట్స్ ను పరిశీలించేవారు.. ఆ సమయంలో తాళం వేసిన ఇళ్ళను గమనించేవారు.

త‌ర్వాత ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించేవారు. ఎవ‌రూ లేని స‌మయం చూసి ఇంటితాళాలు పగులగొట్టి లోప‌లికి వెళ్లేవారు. అక్కడ దొరికిన విలువైన వస్తువులు, నగదుతో ఉడాయించేవారు.ఈ విధంగా సుమారు 100 ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వందకుపైగా సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలించారు. వాటి ఆధారంతో అంబ‌ర్‌ పేట‌లో ఆదివారం నాడు ఆ దొంగ దంపతుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News