ర‌విప్ర‌కాశ్‌, శివాజీల‌కు ల‌భించ‌ని ఊర‌ట‌.. పిటిష‌న్లు వాయిదా వేసిన కోర్టు

Update: 2019-07-09 11:00 GMT
టీవీ 9 వాటాల అమ్మ‌కం, లోగో విక్ర‌యం విష‌యానికి సంబంధించి తీవ్ర వివాదాలు సృష్టించి, ఆ త‌ర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి.. మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చిన టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్‌, న‌టుడు శివాజీల విష‌యం తెలిసిందే. ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో ఏపీలో రాజ‌కీయ సంచ‌ల‌నాల‌కు వేదిక అయిన శివాజీ.. టీవీ 9 వాటాల విక్ర‌యం విష‌యంలో అడ్డంగా బుక్క య్యా రు. ఇక‌, టీవీ 9 వాటాల‌ను విక్ర‌యించ‌డంలో చీటింగ్‌కు పాల్ప‌డ్డార‌నే అభియోగంపై ర‌విప్ర‌కాశ్‌ పై హైద‌రాబాద్ పోలీసులు కేసులు న‌మోదు చేశారు. 2004 నుంచి కూడా టీవీ9 కి ర‌విప్ర‌కాశ్ సీఈవోగా ఉన్నారు. అయ‌తే, టీవీ 9ను అలంద మీడియా అండ్ ఎంట‌ర్‌టై న్‌మెం ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 90.54 % వాటాల‌ను కొనుగోలు చేసింది.

ఈ క్ర‌మంలో అలంద మీడియా ర‌వి ప్ర‌కాశ్‌ ను తొల గించింది. అయితే, దీనికి ముందు ఏబీసీపీఎల్‌ లో మెజారిటీ షేర్లు ఉన్న అలంద మీడియా న‌లుగురుతో కూడిన ఓబోర్డు ను ఏర్పాటు చేసింది. అయితే, కంపెనీ సీఈవోగా ఉన్న ర‌విప్ర‌కాశ్ ఈ కొత్త డైరెక్ట‌ర్ల‌ను ఎంట‌ర్ చేయ‌క‌పోవ‌డం, షేర్ల‌ను అ మ్ము కోవ‌డం, వీటితోపాటు టీవీ 9 లోగోను కూడా 90 వేల కు విక్ర‌యించ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో ఆయ‌న‌పై కుట్ర స‌హా నేర‌పూరిత దుశ్చ‌ర్య‌ల కేసుల‌ను న‌మోదు చేశారు. ఇక‌, ఇదే కేసులో ర‌విప్ర‌కాశ్‌ కు స‌హ‌క‌రించిన ఆరోప‌ణ‌ల‌పై న‌టుడు శివాజీపైనా కేసులు న‌మోద‌య్యాయి.   ర‌వి ప్ర‌కాశ్ నుం చి దాదాపు 40 షేర్ల‌ను కొనుగోలు చేసేందుకు నటుడు శివాజీ ఫిబ్ర‌వ‌రి, 20- 2018లోనే ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టుగా రూపొందించిన డ్రాఫ్ట్‌ ను ఈ ఏడాది ఏప్రిల్‌ లో త‌యారు చేసిన‌ట్టు గుర్తించారు.

దీంతో దీని వెనుక ప‌క్కా వ్యూహంతోనే అటు ర‌వి ప్ర‌కాశ్‌, ఇటు శివాజీ వ్య‌వ‌హ‌రించార‌ని పోలీసులు కేసులు న‌మోదు చేశారు.ఈ  క్ర‌మంలో త‌మ అరెస్టులు త‌ప్ప‌వ‌ని గుర్తించిన ర‌వి ప్ర‌కాశ్ ఏకంగా పోలీసులు త‌న‌ను అరెస్టు చేయ‌కుండా చూడాలని నేరుగా సుప్రీం కోర్టులోనే కేసులు వేశారు. అయితే, రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాల‌ని సుప్రీం కోర్టు తేల్చిచెప్ప‌డంతో ఆయ‌న రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇక‌, ఈ కేసులో త‌న పాత్ర లేనేలేద‌ని, కావాల‌నే ఇరికించార‌ని, సో.. త‌న‌ను ఈ కేసు నుంచి త‌ప్పిచాల‌నిన‌టుడు శివాజీ కూడా కోర్టును ఆశ్ర‌యించారు. అయితే, ఈ రెండు పిటిష‌న్ల విచార‌ణ తాజాగా కోర్టుకు వ‌చ్చింది. దీనిపై ఆ ఇద్ద‌రు ఎన్నోఆశ‌లు పెట్టుకున్నా.. వారికి ఊర‌ట ల‌భించ‌లేదు. ఈ నెల 21కి విచార‌ణ వాయిదా ప‌డింది.


Tags:    

Similar News