తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 16 ప్రజాసంఘాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 16 ప్రజాసంఘాల నిషేధంపై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అమరుల బంధుమిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మకుమారి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నిర్వహించింది కోర్టు. మావోయిస్టు అనుబంధ సంఘాలంటూ చట్టవ్యతిరేకంగా నిషేధం విధించారని పిటిషనర్ పేర్కొన్నారు పద్మకుమారి. నిబంధనల మేరకే నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఏజీ వెల్లడించారు.
కౌంటర్లు దాఖలు చేయాలని సీఎస్, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇదిలావుంటే, తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై, తెలంగాణ విద్యార్థి వేదిక పై, చైతన్య మహిళా సంఘం వంటి మొత్తం 16 ప్రజా సంఘాలపై నిషేదం కొనసాగుతోంది. ఈ నిషేధం పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజా సమస్యలపై, హక్కుల కోసం పోరాడుతున్న సంఘాలపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పిటిషనర్ కోర్టును కోరాడు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 ప్రజా సంఘాలను నిషేధించడం దారుణమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం , ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాలను చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించడం సరికాదన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర హక్కుల సాధనకు కృషిచేసిన చరిత్ర ప్రజాసంఘాలకు ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక హక్కులైనా భావప్రకటన స్వేచ్ఛ, సంస్థలను స్థాపించే హక్కులను ఈ నిర్ణయం కాలరాసేలా ఉందని మండిపడ్డారు.ఉద్యమాల ఫలితంగానే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.