అర్నాబ్ గోస్వామికి షాక్.. 14 రోజుల రిమాండ్

Update: 2020-11-05 15:10 GMT
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న పాత కేసులో ఆయనను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటీరియల్ డిజైనర్ మరణానికి కారణమన్న ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర పోలీసులు అర్నాబ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఈ ఘటనలో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి మహిళా పోలీస్ పై దాడి చేసినందుకు మరో మూడు కేసులు అర్నాబ్, ఆయన భార్య, కుమారుడిపై నమోదయ్యాయి. ఈ అరెస్ట్ వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కాగా అర్నబ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అర్నాబ్ కు షాకిస్తూ 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అలీబాగ్ కోర్టు ఆదేశాల మేరకు అర్నాబ్ ఈనెల 18వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.

అర్నాబ్ గోస్వామిని పోలీస్ కస్టడీకి పంపించాలని కోరగా.. కోర్టు మాత్రం జ్యూడిషియల్ కస్టడీ విధించింది. కాగా అర్నాబ్ అరెస్ట్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు ఖండించారు. పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. సోనియా, రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే మహారాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. ఇక రిపబ్లిక్ టీవీ దీనిపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టులో ఎదుర్కొంటామని పేర్కొంది.
Tags:    

Similar News