బలవంతపు శృంగారం నేరం కేసు: కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు

Update: 2022-02-22 06:31 GMT
వైవాహిక జీవితంలో భార్యకు ఇష్టం లేకుండా బలవంతపు శృంగారం చేయడాన్ని నేరంగా పరిగణించాలంటూ పలు పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వులో ఉంచింది.మరింత గడువు కావాలని కోరింది. పిటీషన్ విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.

అయితే పిటీషన్లపై స్పందించేందుకు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టును కోరారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్ లకు ఫిబ్రవరి 10న అభిప్రాయ సేకరణకు సమాచారం అందించామని.. అయితే ఇంకా స్పందన రాలేదని కోర్టుకు తెలిపారు.

కానీ కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు.. ఈ సందర్భంగా జస్టిస్ రాజీవ్ శక్దేర్, జస్టిస్ సి.హరిశంకర్ లతో కూడిన ధర్మాసనం కేంద్రం వైఖరిని ‘త్రిశంకు’ లాంటిదని పేర్కొంది. గడువు కోరే అంశం ఎప్పుడో దాటిపోయిందని ధర్మాసనం గుర్తు చేసింది.

చత్తీస్ ఘడ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.. చట్టబద్ద వివాహంలో భార్యతో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించలేమని  చత్తీస్ ఘడ్ హైకోర్టు పేర్కొంది.  వైవాహిక అత్యాచార అభియోగం ఎదుర్కొంటున్న ఓ భర్తను నిర్ధోషిగా ప్రకటించింది. అదే సమయంలో భార్యతో అతడు జరిపిన అసహజ శృంగార చర్యలను నేరంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది.

చట్టబద్ద వివాహంలో భార్యతో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించలేమని  ఓ హైకోర్టు  పేర్కొంది.  వైవాహిక అత్యాచార అభియోగం ఎదుర్కొంటున్న ఓ భర్తను నిర్ధోషిగా ప్రకటించింది. అదే సమయంలో భార్యతో అతడు జరిపిన అసహజ శృంగార చర్యలను నేరంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది.

‘18 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న భార్యతో ఆమె భర్త శృంగారం లేదా శృంగారపరమైన చర్యను రేప్ గా పరిగణించలేం.. ఈ కేసులో ఫిర్యాదుదారు.. అభియోగాలు మోపబడిన  వ్యక్తికి చట్టబద్దంగా భార్య కాబట్టి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అతడు ఆమెతో బలవంతపు శృంగారం చేసినా దాన్ని అత్యాచారంగా పరిగణించలేం’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.అసహజ రీతిలో శృంగార చర్యలకు పాల్పడడాన్ని మాత్రం నేరంగా పరిగణిస్తున్నట్టు హైకోర్టు వెల్లడించింది.


Tags:    

Similar News