ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి భారీ షాక్ తగిలింది. హత్య కేసులో కేఈ కుమారుడ్ని అరెస్ట్ చేయాలంటూ న్యాయస్థానం తీర్పు ఇవ్వటం సంచలనంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్ ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చెరుకుల పాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబుతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చాలని.. వారిని అరెస్ట్ చేయాలంటూ డోన్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. గత ఏడాది మే 22న చెరుకులపాటి నారాయణరెడ్డి దారుణంగా హత్యకు గురయ్యారు.
ఈ ఉదంతంపై నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు. హత్య కేసు విచారణలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. తన భర్తతో పాటు మరొక వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారని.. అందులో శ్యామ్ బాబు అనుచరుల పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఛార్జిషీట్ లో పేర్లు తొలగించటంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబుతోపాటు మరో ఇద్దరిని తన భర్త హత్య కకేసులో ముద్దాయిలుగా చేర్చాలంటూ శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం తాజాగా తీర్పునిస్తూ శ్యామ్ బాబుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పు కేఈ ఫ్యామిలీకి షాకింగ్ గా మారిందని చెబుతున్నారు. ఈ తీర్పు మీద అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.