ట్రంప్ ‘బ్యాన్’ నిర్ణయంపై కోర్టు ప్రశ్నాస్త్రాలు

Update: 2017-02-09 05:02 GMT
ఏడు మెజార్టీ ముస్లిం దేశాల పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా ఉండేలా ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కోర్టు ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధిస్తోంది. ట్రంప్ నిర్ణయాన్ని వివిధ కోర్టులు స్టే ఇచ్చిన నేపథ్యంలో.. వీటిని రద్దు చేసేందుకు వీలుగా ప్రభుత్వం శాన్ ఫ్రాన్సిస్కోలో కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా దాదాపు గంట పాటు.. ఫోన్ ద్వారా అధికారుల్ని విచారించిన ముగ్గురు సభ్యులున్న ధర్మాసనం ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో ప్రభుత్వాధికారులు ఉక్కిరబిక్కిరి అయినట్లుగా తెలుస్తోంది.

అసలు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది? ముస్లింలపై వివక్ష చూపించటం రాజ్యాంగ విరుద్ధం కాదా? అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే అమలైపోవాల్సిందేనా? లాంటి ప్రశ్నలు వేసిన కోర్టు.. ఈ ఇష్యూపై తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో సియోటెల్ కోర్టు విధించిన స్టే తీర్పువచ్చే వరకూ అమలు కానుంది.

కేసు విచారణ సందర్భంగా వాదనలు.. ప్రతివాదనల జోరు తీవ్రస్థాయిలో జరగటం గమనార్హం. అధ్యక్షుడి నిర్ణయంపైన ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చని.. కానీ.. ఓ న్యాయమూర్తి అధ్యక్షుడి ఆదేశాల అమలుపై స్టే విధించటం సరికాదంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఆగస్ట్ ఫ్లెంటిజ్ వాదించారు. ఈ కేసు వాదనల సందర్భంగా న్యాయవ్యవస్థపై అధ్యక్షుడు చేసిన విమర్శలు.. ఆరోపణలు వచ్చాయి.మొత్తంగా ఏడు దేశాల పౌరులపై ట్రంప్ విధించిన బ్యాన్ పై కోర్టు తుది తీర్పు వచ్చేవారం వెలువడనుంది.అప్పటి వరకూ ఆయా దేశాల నుంచి అమెరికాకు ఆ దేశ పౌరులు వచ్చే వీలుందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News