పేస్ మాస్క్ .. ప్రస్తుత రోజుల్లో అతి ముఖ్యమైన వాటిల్లో ఇది కూడా ఒకటి. అప్పట్లో చినిగిన చొక్కా అయిన తొడుక్కో కానీ , ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నది సామెత. కానీ, ప్రస్తుతం అదే మంచి పుస్తకం కొన్నా , కొనకపోయినా ఓ మంచి పేస్ మాస్క్ కొనుక్కో అన్నది నేటి సామెత. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత అందరి జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. అందరూ శుభ్రత పాటిస్తున్నారు. కరోనా నియమాలు పాటిస్తున్నా కూడా ఇంకా కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. ఇదిలా ఉంటే కరోనా కాలంలో పేస్ మాస్కులకి ఎంత డిమాండ్ ఉందొ తెలిసిందే. దీనితో కొందరు దొంగలు ఏకంగా లక్షలు విలువ చేసే పేస్ మాస్కులు దొంగతనం చేసి తక్కువ రేటుకి అమ్ముకున్నారు. ఆ తర్వాత పోలీసులు వారిని పట్టుకోవడం తో కోర్టు వారికి తగిన శిక్షని విధించింది.
ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ... దుబాయిలో నివసిస్తున్న ఆరుగురు పాకిస్థానీలు అల్ రషీడియాలోని ఒక వేర్ హౌస్ లోకి అక్రమంగా ప్రవేశించి 1.5 లక్షల దిర్హామ్‌లు (మన కరెన్సీ లో రూ.30.28 లక్షలు) విలువ చేసే 156 బాక్సుల ఫేస్ మాస్క్ లను చోరీ చేశారు. స్థానిక పారిశ్రామిక ప్రాంతంలోని గిడ్డంగి నుంచి 150,000 దిర్హామ్ ల విలువైన 1000 ఫేస్ మాస్క్ లున్న156 బాక్స్ లు చోరికి గురైనట్టు గుర్తించిన 38 ఏళ్ల చైనా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్18 న ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొద్ది రోజుల్లోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత, దొంగతనం చేసిన మాస్క్ లను బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తికి అమ్మినట్టు నిందితులు అంగీకరించారు. తాము గతంలో కూడా అనేక ఇతర దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దీనిపై విచారణ అనంతరం కోర్టు తాజా తీర్పు వెల్లడించింది. అలాగే, జైలు జీవితం అనంతరం తర్వాత నిందితులను దేశం నుంచి బహిష్కరించాలంటూ దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్ స్టాన్స్ ఆదేశించింది.