దేశంలోనే ఇదో అరుదైన విడాకుల కేసు

Update: 2020-10-22 17:31 GMT
చట్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సందర్భాలు, సమయానుసారం మారుతుంటుంది. ఇప్పుడు సంపాదనపరురాలైన ఓ భార్యకు ఫ్యామిలీ కోర్టులో ఇలానే షాక్ తగిలింది.

ఈ కాలంలో విడాకులు సర్వసాధారణం. విడిపోతే భర్త సంపాదన నుంచి భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమేజాన్ అధినేత జెఫ్ బోజెస్ తన భార్యకు దాదాపు 50శాతం వరకు వాటా ఇచ్చాడు. దీంతో ఆమె కూడా ఒక అతిపెద్ద ధనవంతురాలిగా మారిపోయింది. ఇక దేశంలోనూ భారీ విడాకుల కేసులు చాలా ఉన్నాయి.

ఇక ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఓ అరుదైన విడాకుల కేసు వార్తల్లో నిలిచింది.చాలా ఏళ్లుగా విడివిడిగా ఉంటూ విడాకులు కావాలని కోరుతూ ముజఫరాబాద్ ఫ్యామిలీ కోర్టుకు ఎక్కిన జంటలో భార్యకు షాకిచ్చేలా కోర్టు తీర్పునిచ్చింది.

సాధారణంగా విడాకుల కేసుల్లో భర్త విడిపోయే భార్యకు భరణంగా నెలనెలా ఇవ్వాలని కోర్టులు సూచిస్తుంటాయి. కానీ ఇక్కడ భార్య ప్రభుత్వ పెన్షనర్. ఆమెకు నెలకు రూ.12వేలు పింఛన్ వస్తుంది. భర్తకు ఏ సంపాదన లేదు. దీంతో దీన్ని పరిగణలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు భార్యకు షాకిచ్చింది.

హిందూ వివాహ చట్టం-1955 కింద ప్రభుత్వ పెన్షనర్ అయిన భార్య నుంచి భర్తకు భరణం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు తీర్పు నిచ్చింది. తన భర్తకు నిర్వహణ ఖర్చుల కింద ప్రతినెల రూ.1000 చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

దీంతో ఇదో వింత విడాకుల కేసుగా మారిపోయింది. సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు పేలుతున్నాయి.
Tags:    

Similar News