అత్యంత దారుణమైన నేరాలు చేసే బాల నేరస్తుల విషయంపై భారీగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా మూడేళ్ల క్రితం ఢిల్లీలోని కదులుతున్న బస్సులో పారా మెడికల్ విద్యార్థిని సామూహిక అత్యాచారం చేయటం.. అనంతరం ఆమెను బస్సులో నుంచి బయటకు తోసేయటం తెలిసిందే. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకరు బాల నేరస్తుడు (నేరం జరిగే సమయానికి నిందితుడి వయసు 18 సంవత్సరాల కంటే కాస్త తక్కువగా ఉండటం) ఉండటం.. ఈ దారుణంలో అతగాడు అత్యంత పాశవికంగా వ్యవహరించటం తెలిసిందే.
ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. చట్టంలోని మినహాయింపుల కారణంగా సదరు బాల నేరస్తుడికి మూడేళ్ల జైలుశిక్షను విధించటం.. శిక్షా కాలం పూర్తి అయిన నేపథ్యంలో అ మధ్యనే విడుదల చేయటం జరిగింది.అతగాడి విడుదలపై మహిళా కమిషన్ మొదలు.. సామాన్య ప్రజానీకంలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. జైలు నుంచి విడుదల కావటాన్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. ఈ వ్యవహారంలో తాము ఏమీ చేయలేమని.. చట్టాలు ఆ తీరులో ఉన్నాయనన వ్యాఖ్యను చేశారు.
ఈ నేపథ్యంలోనే.. బాల నేరస్తులకు సంబంధించిన వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం.. ఈ బిల్లుకు ఇటీవలే రాజ్యసభ ఆమోదం పలికింది. ఈ సందర్భంలో కొందరు మేధావులు కాస్తంత చిత్రమైన వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటివరకూ మైనర్ ను 18 ఏళ్లుగా ఉన్న స్థానే 16 ఏళ్లకు కుదించటం (తీవ్ర నేరాల విషయంలో) కారణంగా పెద్దప్రయోజనం ఉండదని.. 15 సంవత్సరాల 10 నెలల వయసున్న బాలుడు దారుణమైన నేరానికి పాల్పడితే ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో.. వివిధ దేశాలు ఇదే వ్యవహారంపై ఏం చేస్తున్నారన్న విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా దేశాల్లో దారుణ నేరాలకు పాల్పడే వారి విషయంలో వయసును పెద్దగా పరిగణలోకి తీసుకోరన్న విషయం కనిపిస్తుంది. అంతేకాదు.. దారుణ నేరాలకు పాల్పడే వారి విషయంలోఆయా దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నసంగతి అర్థమవుతుంది.
దారుణ నేరాల విషయంలో వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలు చూస్తే..
= బ్రిటన్ లో ముగ్గురు టీనేజర్లను హత్యకు పురిగొల్పిన నేరంలో 18 ఏల్ల వయసున్న ఒకరికి 14 ఏళ్ల జైలుశిక్ష పడితే.. ఇందులో 14 ఏళ్ల వయసున్న బాల నేరస్తుడికి 12 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
= మన దేశంలో దారుణ నేరాలకు పాల్పడిన బాల నేరస్తులకు మూడేళ్ల పాటు అబ్జర్వేషన్ హోంలో నిర్బంధంగా ఉంచుతారంతే.
= భారత్ లో మాదిరి బ్రిటన్ లో తీవ్రమైన నేరాలకు పాల్పడే వారి విషయంలో చిన్న.. పెద్దా అన్న తేడా ఉండదు. అందరికి ఒకేలాంటి శిక్షలు విధిస్తుంటారు.
= బ్రిటన్ చట్టాల ప్రకారం 10 నుంచి 17 మధ్య తీవ్రమైన నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేయొచ్చని అక్కడి చట్టాలు చెబుతున్నాయి.
= బ్రిటన్ చరిత్రలో రెండేళ్ల పసికందును పదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు హత్య చేశారు. వీరికి మైనార్టీ తీరే వరకూ శిక్ష విధించారు.ఇంత కఠిన శిక్ష బ్రిటన్ లో ఈ ఇద్దరు పిల్లలకే ఉందని చెప్పొచ్చు.
= జపాన్.. నెదర్లాండ్స్ చట్టాల ప్రకారం బాల నేరస్తులు చేసే తీవ్ర నేరాలకు జీవిత ఖైదు విధించొచ్చు.
= జపాన్ లో తక్కువ స్థాయి నేరాల విషయంలో భాగస్వామ్యం ఉన్న పిల్లల విషయంలోనూ కఠినంగా ఉంటారు.
= ఫ్రాన్స్.. దక్షిణాఫ్రికాలలో 16 ఏళ్లకు పైబడిన వయస్కుల్ని పెద్దవారిగా పరిగణించి విచారిస్తారు.
= జర్మనీ.. కెనడాలలో 14 ఏల్ల వయసుకు పైబడిన వారిని విచారించే వీలుంది.
= ఇక.. ఇరాన్ లో అయితే 17 ఏళ్ల వయసున్న ఇద్దరు ఒక హత్య కేసులో దోషులుగా తేల్చారు. వారు చేసిన నేరం రుజువు కావటంతో.. వారిని రెండు నెలల క్రితం ఉరి తీశారు.
= అమెరికాలో ఒక దారుణమైన నేరాన్ని 17 ఏళ్ల మాల్వో చేశాడు. ఇతనితో పాటు 42 ఏళ్ల మహ్మద్ కూడా ఉన్నాడు. కారు నడుపుతూ 17 మందిని చంపిన ఘటనలో పెద్దోడైన మహ్మద్ కు ఉరిశిక్ష వేస్తే.. మాల్వోకు మాత్రం ఆరు వరుస జీవిత ఖైదీల్ని విధించింది. పెరోల్ ఇవ్వటానికి కూడా కుదరదని తేల్చేసింది.
= అత్యాచారం లాంటి తీవ్రమైన నేరాల విషయంలో పెద్దవాళ్లను ఏ తీరులో అయితే విచారిస్తారో.. అదే తీరులో మైనర్ల విషయంలోనూ విచారించొచ్చని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.