మ‌న కోర్టు ఇంకో రికార్డు సృష్టించింది

Update: 2017-04-09 08:16 GMT
ఓ ఆస్తి వివాదాన్ని విచారించే క్రమంలో కోర్టు సంచలన నిర్ణయం తీసుకున్నది. అందుబాటులో లేని వ్యక్తికి వాట్సప్ ద్వారా సమన్లు పంపాలని ఆదేశించింది. దేశంలోని కోర్టుల చరిత్రలో వాట్సప్ ద్వారా సమన్లు పంపనుండడం ఇదే తొలిసారి కానుంది. ఇప్పటివరకు ఈ-మెయిల్ - ఫ్యాక్స్ ద్వారా సమన్లు పంపుతున్నా.. మెసేజింగ్ యాప్ ద్వారా సమన్లు పంపడం ఇదే ప్రథమం. హ‌ర్యానాలో ఈ సంఘ‌టన జ‌రిగింది.

హర్యానా రాష్ట్రం హిసార్‌ లోని ఔరంగ్ షాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం తలెత్తింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ కమిషనర్(ఎఫ్‌ సీ) కోర్టులో సత్బీర్ సింగ్ తన ఇద్దరు సోదరులు రామ్‌ దయాళ్ - కృష్ణకుమార్‌ పై కేసు వేశాడు. వారి సమాధానం కోరుతూ కోర్టు నోటీసులు పంపింది. రామ్‌ దయాళ్‌ కు నోటీసులు అందించగా, కృష్ణ కాఠ్మండుకు వెళ్లడంతో ఇవ్వలేకపోయారు. కృష్ణ ఫోన్‌ లో అందుబాటులో ఉన్నా తానెక్కడున్నది చెప్పడంలేదని స్థానిక రెవెన్యూ అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన ఖేమ్కా ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఈ-మెయిల్ అడ్రస్‌ నుగానీ - మొబైల్ నంబరును గానీ చిరునామాగానే పరిగణిస్తామని, కృష్ణకు వాట్సప్ ద్వారా సమన్లు పంపాలని ఆదేశించింది. అనంతరం డెలివరీ నివేదికను ప్రింట్‌ అవుట్ తీసి సమర్పించాలని సూచించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News