గుడ్ న్యూస్.. కరోనా తర్వాత కోవాగ్జిన్ టీకా వేసుకుంటే అంత లాభమట

Update: 2021-08-29 12:30 GMT
భారత వైద్య మండలి.. షార్ట్ కట్ లో ఐసీఎంఆర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కరోనా బారిన పడి..కోలుకున్న తర్వాత వేసుకునే వ్యాక్సిన్ తో లాభం ఎంతన్న విషయాన్ని చెప్పటమే కాదు.. సంతోషానికి గురయ్యేలా చేసింది. ఈ సంస్థలోని పరిశోధకులు కోవాగ్జిన్ మీద అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. వారు వెల్లడించిన సమాచారం ప్రకారం.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక డోస్ వేసుకుంటే రెట్టింపు ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైన వివరాల్ని ఇండియల్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో పబ్లిష్ కావటం గమనార్హం. మన దగ్గర ఫర్లేదు కానీ.. చాలా చోట్ల టీకాల కొరతతో కిందామీదా పడుతున్న పరిస్థితి ఇలాంటివేళ.. భారత్ తన స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన కోవాగ్జిన సత్తా ఎంతన్న విషయాన్ని తాజాగా వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ ను 4-6 వారాల విరామంతో రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది.

తాజాగా జరిపిన అధ్యయనం ఎలా చేశారంటే.. చెన్నైలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకు కోవాగ్జిన్ మొదటి డోసు ఇచ్చిన 114 మంది ఆరోగ్య నిపుణులు.. ఫ్రంట్ లైన్ వర్కర్లను పరిశీలించారు. టీకా వేసిన 28 రోజులకు.. 56 రోజుల తర్వాత వీరిలో యాంటీబాడీ స్పందనను చెక్ చేశారు. వ్యాక్సిన్ కు ముందు కరోనా సోకిన వారికి.. వైరస్ బారిన పడని వారిని వేర్వేరుగా గుర్తించి.. పరిశోధించారు. ఈ ఇద్దరి మద్య వ్యత్యాసాలు ఏమిటన్నది పరిశీలించారు

కరోనా సోకని వారితో పోలిస్తే.. సోకిన వారిలో స్పందనలు తేడా ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తంగా చూస్తే.. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో టీకా వేస్తే మాత్రం యాంటీబాడీ స్పందన అద్భుతంగా ఉందని తేల్చారు. కోవిడ్ బారిన పడి.. అనంతరం కోవాగ్జిన్ టీకా వేయించుకున్న వారికి.. వారికి తెలీకుండానే పెద్ద ఎత్తున యాంటీబాడీలు రక్షణగా నిలుస్తుందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.కరోనా వేళ.. ఇంతకు మించిన రిలీఫ్ ఇంకేం ఉంటుంది చెప్పండి?
Tags:    

Similar News