కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కుదిపివేసింది. ఈ వైరస్ మానవశరీరభాగాలపై ఏ విధంగా ప్రభావం చూపుతున్నదన్న విషయంపై ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తల పరిశోధనల్లో పలు షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. కరోనా వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని.. శ్వాస ఇబ్బందులతో రోగులు చనిపోతున్నారన్నది తెలిసిన విషయమే.అయితే కరోనా శరీరంలోని రక్తనాళాలు, మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనల్లో బయటపడింది.
కరోనాతో చనిపోయిన వారిపై ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అయితే ఈ సందర్బంగా వాళ్లు పలు విషయాలను గుర్తించారు. కరోనా వైరస్ అనేకమంది మెదడుపై కూడా ప్రభావం చూపించినట్టు ఈ పరిశోధన తేల్చింది. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధన చేశారు. మార్చి నుంచి జూలై 2020 మధ్య కరోనాతో మరణించిన వారి శరీర కణజాలాలపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. ఈ పరిశోధనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
కరోనాతో చనిపోయిన వారి మెదడులో మైక్రోవాస్కులర్ రక్తనాళాల దెబ్బతిన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. అయితే మెదడు కణజాలాల్లో కరోనా వైరస్ ఆనవాళ్లను వాళ్లు గుర్తించలేదు. కానీ కరోనా సోకినవారికి మెదడుపై ప్రభావం చూపించనట్టు మాత్రం తేలింది. అయితే ఈ విషయంపై ఇంకా పరిశోధన సాగాల్సి ఉన్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వైరస్ సోకినవారికి సంబంధించిన ఎంఆర్ఐ స్కానింగ్‌ల ఆధారంగా వాళ్లు ఈ పరిశోధన కొనసాగించారు. ఇప్పటికే రక్తంపై కూడా కరోనా వైరస్ ప్రభావాన్ని చూపిస్తుందని తేలింది. తాజాగా మెదడు నరాలు, కణాజాలాలపై కూడా కరోనా వైరస్ ప్రభావం చూపిందని తేలింది.