అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. వివాదాస్పద వ్యాఖ్యలకి , వింత వ్యాఖ్యలకి కేరాఫ్ అడ్రస్. తాజాగా మరోసారి విచిత్ర వ్యాఖ్యలు చేసి తన శైలిని బయటపెట్టారు. కరోనా మామూలు ఫ్లూ లాంటిదే అంటూ ప్రకటించి వివాదాన్ని రేపిన ట్రంప్ తాజాగా మరో వివాదాన్ని రాజేశారు. తనకు కరోనా సోకడం దేవుడి దీవెన అంటూ ఈ మహమ్మారి తనకు సోకిన తరువాతనే దీన్ని నయం చేయగల అత్యంత శక్తిమంతమైన ఔషధాల గురించి తనకు తెలిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా పాజిటివ్ రావడంతో మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి కోలుకున్న తర్వాత ఒక వీడియోను విడుదల చేశారు.
తనకు చికిత్స అందించిన వైద్యులపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అమెరికా పౌరులకు కూడా ఇదే స్థాయిలో ఉచితంగా చికిత్స అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు కరోనా విస్తరణపై డ్రాగన్ దేశంపై ఇప్పటికే పలుమార్లు మండిపడిన ట్రంప్ మరోసారి తన దాడిని ఎక్కు పెట్టారు. ఆ వీడియోలో చైనాను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఎంతో పాపం చేసిందని, అందుకు తగిన భారీ మూల్యాన్ని చెల్లించుకుని తీరుతుందని శాపాలు పెట్టారు.
తనకు అందిన చికిత్సనే, అందరు అమెరికన్లకూ ఉచితంగా అందించేలా చూస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ చికిత్స పొందేందుకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదన్న ఆయన,తనకి కరోనా వైరస్ రావడానికి అమెరికన్లు కారణం కాదని, ఇందుకు కారణం చైనాయేనని స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఇప్పటికే రెండు లక్షల పదివేలకుపైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు తహతహలాడుతున్న ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోతున్నారు.