దేశ ఆర్లిక రాజధాని మంబయిలో మళ్లీ కొవిడ్ కలకలం. కరోనా భయం తొలగిపోలేదని.. మాస్క్లులు ధరించడం మానొద్దని, చేతుల పరిశుభ్రత మరువొద్దని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే హెచ్చరించిన కొన్ని రోజులకే కేసుల్లో పెరుగుదల.. దీన్నిబట్టి నగరంలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా? అనే అనుమానం వస్తోంది. వాస్తవానికి ఇటీవల కాలంలో కరోనా కేసులన్నీ ఎక్కువగా అసింప్టమాటిక్ (లక్షణాలు కనిపించని)వే. ఇప్పుడు ముంబైలో నమోదవుతున్న కేసులు మాత్రం సింప్టమాటికే (లక్షణాలు కనిపించేవి) ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబైలో మంగళవారం 700 మందికి వైరస్ నిర్ధారణ అయింది. పాజిటివిటీ (ప్రతి 100 పరీక్షల్లో పాజిటివ్ శాతం) 6%. అయితే బుధవారం కేసుల సంఖ్య 739కి.. పాజిటివిటీ 8.4 శాతానికి చేరుకుంది.
గత రెండు వేవ్ లలాగానే..కరోనా మొదటి, రెండో వేవ్ లకు కేంద్ర స్థానంగా నిలిచింది మహారాష్ట్ర. మరీ ముఖ్యంగా ముంబయి, పుణె నగరాలు వణికిపోయాయి. లక్షలాదిమంది వైరస్ బారినపడ్డారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రకు వివిధ దేశాల నుంచి రాకపోకలు పెద్ద సంఖ్యలో ఉండడంతో వైరస్ వ్యాప్తికి కారణమైంది. అంతేగాక దేశంలోని వివిధ ప్రాంతాల వారు మహారాష్ట్రకు రాకపోకలు సాగించేవారు. వీటన్నిటి నేపథ్యంలోనే నాడు కొవిడ్ కేంద్రంగా నిలిచింది.
డెల్టా పుట్టింది మహారాష్ట్రలోనే..దేశంలో సెకండ్ వేవ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో చూశాం. లక్షలాది మరణాలు సంభవించాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో రాష్ట్రాలకు రాష్ట్రాలు అల్లాడాయి. శ్మశానాల్లో సామూహిక ఖననాలు, దహనాలు చోటుచేసుకున్నాయి. ఇంతటి విధ్వంసానికి కారణం డెల్టా వేరియంట్. నేరుగా ఊపిరితిత్తుల్లోకి జారిపోయిన డెల్టా శ్వాస వ్యవస్థను స్తంభింపజేసింది. కాగా, ఆ ప్రమాదకర డెల్టా వేరియంట్ పుట్టింది మహారాష్ట్రలోనే. తొలి వేవ్ తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను సడలించడంతో ప్రజలు జాగ్రత్తలు మరిచారు. ఆ క్రమంలో కొత్త వేరియంట్ ఉద్భవించింది.
దేశంలోనూ పెరుగుతున్న కేసులు..మహారాష్ట్ర ప్రభావంతో దేశంలో తాజాగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. ముందురోజు 2,745గా ఉన్న కేసులు వెయ్యి మేరకు పెరిగి మూడు వేలు దాటాయి. ముంబయిలో పాజిటివిటీ రేటు 8.4 శాతం చేరుకుందన్న వార్తల నేపథ్యంలో ఈ అంకెలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఆర్థిక రాజధాని నగరంలో 739 మందికి పాజిటివ్‌గా తేలింది. అక్కడ ఫిబ్రవరి ఒకటి తర్వాత ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. ఈ కొత్త కేసుల ప్రభావం బాధితుల సంఖ్యపై పడింది. దాంతో గురువారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. క్రియాశీల కేసులు 19వేల మార్కు దాటేశాయి. బుధవారం 4.41 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,712 మందికి పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్ర, కేరళ నుంచే రెండు వేల పైగా కేసులొచ్చాయి. రోజువారీ పాజిటివిటీ 0.60 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,584 మంది కోలుకున్నారు. ఐదు మరణాలు సంభవించాయి. క్రియాశీల కేసులు 19,509కి పెరిగాయి. 2020 ప్రారంభం నుంచి 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.26 కోట్ల మందికిపైగా వైరస్‌ను జయించారు. దాంతో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. క్రియాశీల కేసులు వాటా 0.05 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక నిన్న 12.4 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 193.7 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.
ముంబై అప్రమత్తం..తాజా కేసుల్లో సింప్టమాటికే ఎక్కువగా ఉంటుండడంతో ముంబయి కార్పొరేషన్ అప్రమత్తమైంది. టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని ముంబైలోని ల్యాబ్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రులు కొవిడ్ చికిత్సలకు సన్నద్ధంగా ఉండాలని.. ఆ మేరకు సిబ్బందిని అందుబాటులో పెట్టాలని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత ఆ స్థాయిలో అత్యధిక కేసులు బుధవారం నమోదయ్యాయని పేర్కొన్నారు. సింహభాగం కేసులు సింప్టమాటిక్ అని హెచ్చరించారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇంటింటికీ టీకా 2.0 దేశంలో టీకా అర్హత ఉన్నవారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న హర్ ఘర్ దస్తక్ అభియాన్(ఇంటింటికీ టీకా) రెండో దశ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.ఈ కార్యక్రమం వచ్చేనెల 31 వరకు కొనసాగనుంది. తొలిదశ గత ఏడాది నవంబరులో ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండో దశలో 12-18 ఏళ్ల మధ్య వయసు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. స్కూళ్లు, కాలేజీల్లో టీకా శిబిరాలు ఏర్పాటు చేయాలని.. బడికి వెళ్లని పిల్లలను కూడా గుర్తించి, వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించింది. వృద్ధాశ్రమాల్లో ప్రికాషనరీ డోస్‌లు ఇవ్వాలని, ఇప్పటి వరకు ఒకటి, రెండు డోసులు తీసుకోనివారిని గుర్తించి, వారికి టీకా వేయాలని పేర్కొంది. 18-59 ఏళ్ల వారికి ప్రికాషనరీ డోస్ ఇచ్చేలా ప్రైవేట్ ఆస్పత్రులు, కేంద్రాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా.. ఇప్పటి వరకు దేశంలో 193.57 కోట్ల డోసుల టీకాలు ఇచ్చినట్లు వెల్లడించింది. 15 ఏళ్ల పైవయసు ఉన్నవారిలో 96.3 మంది కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారని.. 86.3 మంది రెండు డోసులూ తీసుకున్నారని వివరించింది.