కరోనా యూరప్, అమెరికా దేశాలను అల్లాడిస్తోంది. తాజాగా బయటపడిన ఒమిక్రాన్ తీవ్రతతో యూరప్ దేశంలో వేల కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ఆంక్షలు, నిబందనలు కఠినతరం చేయడంతో భారతీయులు స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఇటలీ నుంచి అమృత్ సర్ కు వచ్చిన ఓ విమానంలో 125 మందికి పైగా పాజిటివ్ గా తేలడం కలకలం రేపింది. తాజాగా మరో విమానం కూడా వచ్చింది. అందులో ఏకంగా 150 మందికి కరోనా పాజిటివ్ గా తేలడం కలకలం రేపుతోంది.
మొన్నటికి మొన్న ఇటలీ నుంచి అమృత్సర్ ఎయిర్ పోర్టుకు వచ్చిన చార్టైడ్ విమానంలో 125 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ఆంక్షలు విధించింది.ముఖ్యంగా 'ఎట్ రిస్క్' దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. ఇందులో భాగంగానే ఇటలీ నుంచి ఓ చార్టెడ్ విమానం అమృత్ సర్ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే అందులోని ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ టెస్టుల్లో మొత్తం 125 మంది ప్రయాణికులకు వైరస్ సోకినట్లు తేలింది.
ఈ చార్టెడ్ విమానంలో మొత్తం 179మంది ప్రయాణికులున్నారు. ఇందులో 19మంది చిన్నారులు.. వారిని మినహాయించి పెద్దలందరికీ పరీక్షలు చేశారు. పెద్దసంఖ్యలో పాజిటివ్ గా తేలడంతో అప్రమత్తమైన అధికారులు వారిని క్వారంటైన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎయిర్ పోర్టు ముందు అంబులెన్స్ లు బారులు తీరాయి. వారందరినీ ఐసోలేషన్ కు పంపారు.
ఇది జరిగి ఒక్కరోజైనా కాకముందే ఇటలీ నుంచి నేడు అమృత్ సర్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న విమానంలో 150మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. పాజిటివ్ గా తేలిన 150 మందిని ఐసోలేషన్ కు తరలించనున్నారు.