కరోనా వైరస్ ను గుర్తించేందుకు ఇప్పటికే కొన్ని పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా మరో పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం ఒక మొబైల్ యాప్ తో వైరస్ ను గుర్తించడం సాధ్యమని అంటున్నారు అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన పరిశోధకులు. దీనికి అనుగుణంగా మరో డయాగ్నోసిస్ కిట్ ఒకటి ఉంటుందని తెలిపారు. దీని సాయంతో కేవలం వైరస్ ను మాత్రమే గుర్తించడం కాకుండా ఇతర వేరియంట్ల కు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షా పద్ధతి లో ఉన్న మరో ప్లస్ పాయింట్ ను కూడా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. కోవిడ్ పరీక్ష ఫలితం తో పాటుగా దీనిలో సాధారణ ఫ్లూ గురించి కూడా తెలుస్తుందని పేర్కొంది. ప్రత్యేకించి దీనిలో కోవిడ్ మాత్రమే కాకుండా ఇతర వైరస్ లను గుర్తించి టెస్ట్ రిపోర్టు ఇస్తుందని పరిశోధకులు చెప్పారు.
ఈ మొబైల్ యాప్ సాయంతో నిర్ధారించే వైరస్ పరీక్షలకు కేవలం 25 నిమిషాలు మాత్రమే సమయం పడుతుందని పరిశోధకులు వివరించారు. ప్రపంచంలో నూటికి యాభై శాతం మంది కి పైగా మంచి స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నారు. పరీక్షా పరికరం కేవలం ఓ చిన్న యాప్ సాయంతో నిర్వహించవచ్చని తెలిపింది. ఇది చిన్న, మధ్య తరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా తీసుకువస్తున్నట్లు పేర్కొంది. సాధారణంగా అయితే ఇందులో ఉండే డయాగ్నసిస్ కిట్ వంద డాలర్లు ఉంటుందని కాకపోతే ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉండేలా ఈ మొత్తాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. అత్యంత తక్కువ ఖర్చుతో ప్రజల ముందుకు త్వరలోనే రానున్నట్లు పేర్కొన్న వీరు.. దానికి స్మార్ట్ లాంప్ అని నామకరణం చేసినట్లు చెప్పుకొచ్చారు.
ఈ పరీక్ష చేయడానికి కొవిడ్ వచ్చిన రోగికి సంబంధించిన లాలాజలాన్ని కొంచెం తీసుకోవాలి. అనంతరం మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్, ముందుగా అనుకున్న కిట్ ను తీసుకోవాలి. లాలాజలాన్ని కిట్ లో వేసి.. స్మార్ట్ ఫోన్ కెమెరా ద్వారా నిశితంగా పరీక్షిస్తే రిజల్ట్ కూడా కచ్చితంగా వస్తుందని పరిశోధకులు చెప్పారు. అంతేగాకుండా దీనికి మరే ఇతర పరికరాలు అవసరం లేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత సున్నింతగా కోవిడ్ పరీక్షను ఈ పద్ధతి ద్వారా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే అమెరికాలో కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టిన సరే మరణాల సంఖ్య భారీగా పెరిగింది.
తాజా గణాంకాల ప్రకారం కొత్త కేసులు మూడు లక్షలకు పైగా నమోదు అయ్యాయి. మరణాలు దాదాపు మూడు వేలకు చేరుకున్నాయి.