నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. అహ్మదాబాద్ లోని ఒక రద్దీ మార్కెట్ లో ఒక ఆవును దొంగతనం చేశారు. అదీ మాములుగా తోలుకు వెళ్లిపోవడం కాదు. ఆ ఆవును బలవంతంగా కారులోనికి ఈడ్చేసి తాపీగా కారు డ్రైవ్ చేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘరానా చోరీ అంతా రోడ్డు పక్కన ఉన్న బిల్డింగ్ నుంచి ఒక వ్యక్తి చిత్రీకరించాడు. ఆ వీడియో ఫుటేజ్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది. ఆవు కోసం ఈ రేంజ్ లో కిడ్నాప్ నకు పాల్పడటం అదీ బహిరంగంగా కావడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలాఉండగా...ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ ఒక దళితుడి ఇంట భోజనం చేయనున్నారు. ఆయన నాలుగు రోజులపాటు ఆగ్రా పర్యటనలో భాగంగా ఈ నెల 24న రాజేందర్ సింగ్ అనే దళితుడి ఇంట భోజనం చేస్తారు. చెప్పుల ఫ్యాక్టరీ యజమాని అయిన సింగ్ గతంలో ఆరెస్సెస్ కార్యకర్త కావడం గమనార్హం. కాగా స్థానిక ఆరెస్సెస్ ప్రతినిధి కేశవ్ దేవ్ శర్మ మాట్లాడుతూ దళితుల ఇంట మోహన్ భగవత్ భోజనం చేయడంలో ఎలాంటి ప్రత్యేకతా లేదన్నారు. తాము ఎప్పటినుంచో ఈ పద్ధతిని అమలు చేస్తున్నామని చెప్పారు. సమానత్వం - సౌభాతృత్వాల గురించి ఆరెస్సెస్ కేవలం మాట్లాడటమే కాదని, ఆచరణలో కూడా చూపుతుందని ఆయన అన్నారు. ఆరెస్సెస్ కులాల గురించి పట్టించుకోదని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే మీడియాకు చూపించడం కోసం దళితుల ఇంట భోజనం చేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
Full View