గోర‌క్ష‌కుల గురించి రోహిత్ సంచ‌ల‌న కామెంట్స్‌

Update: 2016-08-13 17:30 GMT
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ స్కాలర్ దివంగత రోహిత్ వేముల గో ర‌క్ష‌కుల‌పై ఆస‌క్తిక‌ర‌మైన అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అదేంటి ఆయ‌న చ‌నిపోయిన క్ర‌మంలో అభిప్రాయాలు ఎలా వెల్ల‌డిస్తారంటారా? రోహిత్ రాసిన ఆన్‌ లైన్ డైరీ తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. దీంతో ఆయ‌న అభిప్రాయాలు తెలిశాయి. జుగ్గర్ నాట్ బుక్స్ రోహిత్ వేముల ఆన్ లైన్ డైరీని ఇటీవల ప్రచురించింది. ‘కేస్ట్ ఈజ్ నాట్ ఏ రూమర్’ పేరుతో రోహిత్ వేముల ఆన్ లైన్ డైరీని జర్నలిస్టు నిఖిల వేముల ప్రచురించారు. గోరక్షకులమంటూ దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిని టెర్రరిస్టులుగా ప్రకటించాలని తన ఆన్ లైన్ డైరీలో రోహిత్‌ పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 15న ఆయన తన డైరీలో ఈ అంశాన్ని పేర్కొన్నారు.

గోరక్షణ అనేది భారత రాజకీయాలలో ప్రధాన అంశంగా మారడానికి ఎంతో ముందుగానే రోహిత్ వేముల గోరక్షకుల ఆగడాలను తన ఆన్ లైన్ డైరీలో పేర్కొన్నారని అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. వేముల తన ఆన్ లైన్ డైరీలో కులం పేరుతో, గోవు పేరుతో దేశంలో నడుస్తున్న రాజకీయాలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. గో-దళాలు చేస్తున్న విధంగా మరో సంస్థ ఏదైనా ఇలా మనుషుల ప్రాణాలను తీస్తే ఆ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి ఉండేవారని రోహిత్ వేముల 2015, డిసెంబర్ 12న తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా గోరక్షకులపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు అవమానకరమని విశ్వహిందూ పరిషత్ అంతర్యాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడిన ఆయన మోడీ గోరక్షకులను సంఘ విద్రోహశక్తులుగా అభివర్ణించడం వారిని అవమానించడేమని అన్నారు. ప్రభుత్వం వెంటనే గోరక్షకులతో మాట్లాడాలని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News