విషయం ఏదైనా కానీ.. కామ్రేడ్లు కానీ కదం తొక్కారంటే ఆందోళన రచ్చ రచ్చ కావాల్సిందే. రేషన్ కార్డుల జారీ కోసం వారు చేసే ఆందోళన చేస్తే కొద్దిపాటి ఆశ్చర్యం కలగక మానదు. ప్రభుత్వం విధాన పరంగా నిర్ణయం తీసుకొని.. రేషన్ కార్డుల జారీని కొంతకాలం ఆపినా.. రేషన్ కార్డుల కోసం వారు చేసే ఆందోళన భారీగా ఉంటుంది.
అలాంటి వారు.. ఏదైనా సీరియస్ ఇష్యూను చేపట్టి.. నిజంగా ఆందోళన చేయాలని ప్లాన్ చేస్తే.. టార్గెట్ అయిన వారు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. రాష్ట్ర విభజన విషయంలో విభజనకు మొగ్గు చూపి.. తెలంగాణ ఏర్పాటు విషయంలో పూర్తి స్థాయి మద్ధతు ఇచ్చి.. ఏపీ ప్రజల గురించి ఏ మాత్రం ఆలోచించని.. సీపీఐ.. తాజాగా మాత్రం విభజన కారణంగా ఏపీకి జరుగుతున్న అన్యాయాల మీద గళం విప్పాలని డిసైడ్ అయ్యింది.
విభజనతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శుల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఏపీ రాష్ట్ర బాధ్యతల్ని స్వీకరించిన రామకృష్ణ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై పోరాడేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ అధికారపక్ష నేతలకు నిరసన సెగ తగిలేలా వారు ప్లాన్ చేస్తున్నారు. సీమ టపాకాయ లాంటి జేసీ దివాకర్ రెడ్డికి చిర్రెత్తేలా తాజాగా సీపీఐ నేతలు వినూత్న నిరసనను చేపట్టారు.
అనంతపురంలోని జేసీ దివాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న సీపీఐ నేతలు.. కార్యకర్తలు వారి ఇంటి ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. అంతేకాదు.. ఈ సందర్భంగా చీరె.. రవికె.. గాజులు.. పసుపు పంపారు. ఏపీకి ఫ్రత్యేక హోదా తేవటంలో విఫలమవుతున్నారంటూ జేసీ దివాకర్ రెడ్డికి.. నిమ్మల కృష్ణప్పకు ఇదే తీరులో వారు చీర.. రవికె..గాజులు.. పసుపుతో వారికి మండిపోయేలా చేశారు. మరి.. కామ్రేడ్ల వ్యవహరించిన తీరుకు ఈ సీమ నేతలు ఎలా స్పందిస్తారో..?