నారాయ‌ణ అండ్ కోను అనంత‌లో అరెస్ట్

Update: 2017-05-17 14:25 GMT
ఒక‌ప్పుడు వామ‌ప‌క్ష నేత‌లంటే చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉండేవారు. వారు ఏదైనా నిర‌స‌న కార్య‌క్ర‌మానికి.. ఆందోళ‌న‌కు పిలుపునిస్తే మొత్తం యంత్రాంగం ఒక్క‌సారిగా అలెర్ట్ అయిపోయేది. వారి విష‌యంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌టానికి భ‌య‌ప‌డేవారు. ఆచితూచి వ్య‌వ‌హ‌రించేవారు. కానీ.. ఇప్పుడా ప‌రిస్థితి లేద‌ని చెప్పాలి. కాల‌క్ర‌మంలో వారు చేసిన త‌ప్పుల కార‌ణంగా కామ్రేడ్స్ కు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ త‌గ్గింది. విభ‌జ‌న వేళ వారు పోషించిన పాత్ర కూడా వారిని రాజ‌కీయంగా దెబ్బ తీసింద‌న్న వాద‌న కూడా వినిపిస్తూ ఉంటారు.

విభ‌జ‌న త‌ర్వాత‌.. వారి ఉనికి ఏపీలో ప్ర‌శ్నార్థ‌క‌మైతే.. తెలంగాణ‌లో అంతోఇంతో అన్న‌ట్లుగా ఉంది. అయితే.. ఇద్ద‌రు చంద్రుళ్ల చాణుక్యంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాము న‌మ్ముకున్న ప్ర‌జాఉద్య‌మాల‌తో  ముందుకెళుతున్న వారు.. ఏ విష‌యాన్ని వ‌దిలిపెట్ట‌కుండా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. వారు ప‌డుతున్న శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ద‌క్క‌టం లేద‌నే చెప్పాలి.

ఈ మ‌ధ్య‌నే తెలంగాణ‌లో ధ‌ర్నా చౌక్ ప‌రిర‌క్ష‌ణ కోసం వారు చేసిన ఆందోళ‌న తెలంగాణ స‌ర్కారుకు కొంత‌మేర డ్యామేజ్ చేసింద‌నే చెప్పాలి. ధ‌ర్నాచౌక్ కోసం వీరు చేస్తున్న ఆందోళ‌న‌ను కంట్రోల్ చేసేందుకు ప్ర‌య‌త్నించినా త‌మ శ‌క్తుల‌న్నింటిని ఒడ్డి మ‌రీ నిర‌స‌న‌ను విజ‌య‌వంతం చేసేందుకు కృషి చేశార‌ని చెప్పాలి.

త‌మ నిర‌స‌నల‌తో తెలంగాణ చంద్రుడికి సురుకు పుట్టించిన కామ్రేడ్స్ దృష్టి ఇప్పుడు ఏపీ మీద ప‌డింది. తాజాగా వారు అనంత‌పురంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి సీపీఐ నారాయ‌ణ హాజ‌ర‌య్యారు. క‌రువుతో అల్లాడుతున్న రైతుల్ని ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తూ అనంత‌పురం క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ధ‌ర్నాకు దిగారు.

రైతుల క‌రువు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి 48 గంట‌ల ఆందోళ‌న‌కు  వామ‌ప‌క్షాలు పిలుపునిచ్చాయి. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్‌ను ముట్ట‌డించ‌టంతో భారీగా భ‌ద్ర‌తా బ‌ల‌గాల్ని మొహ‌రించారు. క‌లెక్ట‌రేట్ ముట్ట‌డిని విజ‌య‌వంతం చేసేందుకు వామ‌పక్షాలు ప్ర‌య‌త్నించ‌టం.. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్ర‌య‌త్నాల‌తో అక్క‌డ తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితి నెల‌కొంది. చివ‌రికి ప‌రిస్థితిని కంట్రోల్ చేసేందుకు నారాయ‌ణ‌తో స‌హా కామ్రేడ్స్ ప‌లువురిని అదుపులోకి తీసుకున్న అనంత పోలీసులు వారిని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. తెలంగాణ‌లోనే కాదు.. ఏపీలోనూ ప్ర‌భుత్వం ఉద్య‌మాల్ని నిరంకుశంగా అణిచేస్తుంద‌న్న ఆవేద‌న‌ను నారాయ‌ణ అండ్ కోకు వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News