చైనాలో వెలుగులోకి వచ్చిన ఓ కంటికి కనిపించని వైరస్ ..ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ దెబ్బకి ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ప్రస్తుతం ఒక దేశానికీ మరోదేశానికి అసలు సంబంధాలు లేవు. అమెరికా సైతం ఈ వైరస్ ను ఎదుర్కోలేక చతికిల పడిపోయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా ఈ వ్యాధి భారిన పడిన వారి సంఖ్య కోటికి చేరువలో ఉంది. ప్రస్తుతం ఈ వైరస్ ఇండియా లో రోజురోజుకి మరింత భయంకరంగా విజృంభిస్తుంది.
అయితే, ఈ వైరస్ వ్యాప్తి చెందటం మొదలై ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఈ వైరస్ కి సరైన వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టలేదు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంతవరకు WHO వైరస్ కి విరుగుడు తయారు అయినట్టు ప్రకటించలేదు. కానీ , బాబా రాందేవ్ మాత్రం ఈ మహమ్మారి అసలు వ్యాక్సిన్ ఇదేనంటూ ఓ మందుని విడుదల చేసారు. అయితే , దీనిపై సిపిఐ నేత నారాయణ స్పందించారు.
పతాంజలి సంస్థ ద్వారా ఈ వైరస్ కు మందులు కనిపెట్టామని చెప్పి ప్రపంచ దేశాల ప్రజలను మోసం చేశాడు. ప్రపంచంలో ఇంతవరకు సైంటిస్ట్ సంస్థలు గాని, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాని వైరస్ కు మందులు కని పెట్టలేదని చెబుతున్నాయి. ఇంకా మందుల తయారీ ప్రయత్నం లోనే ఉన్నామని చెపుతున్నారు. ఐ సొల్యూషన్ లో ఉండి చికిత్స చేసుకోవాలని తెలుపుతున్నారు. ఇలాంటి తరుణంలో యోగా చేసుకునే రాందేవ్ బాబా వైరస్ కు మందులు కనిపెట్టామని చీటింగ్ చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే రాందేవ్ బాబాను అరెస్టు చేసి జైలుకి పంపాలని , అలాగే, పతాంజలిని మూసివేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేసారు.