న‌యీం మ‌నుషుల‌కు కేసీఆర్ అండ‌

Update: 2016-12-30 06:55 GMT
నరహంతకుడు నయీం కేసులో అధికార పార్టీ టీఆర్‌ ఎస్ రాజ‌కీయం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమ‌ర్శించారు. నయీం కేసు విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించాల‌ని తాను హైకోర్టులో వేసిన పిటిష‌న్ కు స్పంద‌న‌గా తెలంగాణ స‌ర్కారు కౌంట‌ర్ దాఖ‌లు చేసిన తీరును ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. నయీంకు రాజ‌కీయ నాయ‌కుల‌తో సంబంధాలు లేవ‌ని పేర్కొంటూ తెలంగాణ న్యాయ‌శాఖ అఫిడవిట్ దాఖ‌లు చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌న్నారు.  రాజకీయ ప్రయోజనాల కోసమే సీబీఐ విచారణకు పిటిషన్‌ దాఖలు చేశారని హోంమంత్రి  చెప్పడం విడ్డూరమని నారాయణ అన్నారు. న‌యీం అంతు చూస్తామ‌ని చెప్పిన టీఆర్ ఎస్ పార్టీ  ఇపుడు ఆయ‌నతో అంట‌కాగిన వారికి అభ‌యం ఇస్తోంద‌ని విమ‌ర్శించారు.

నయీం విషయంలో తమకెలాంటి స్వప్రయోజనాలు లేవని తెలిపిన నారాయ‌ణ ఈ కేసు విషయంలో స్వప్రయోజనాల కోసం అమాయకులను బలిచేస్తూ పెద్దవాళ్ళను కాపాడే ప్రయత్నం టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. డీఐజీ స్థాయి వ్యక్తి - డీజీపీ స్థాయి వ్యక్తులను విచారించడం ఎలా కుదురుతుందని చెప్తూ... కేసును తారుమారు చేసేందుకు టీఆర్‌ ఎస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని నారాయణ అన్నారు. నయీం వెనక బడాబడా నేతలున్నారని తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంద‌ని నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాగా..న‌యీం ఎన్ కౌంట‌ర్ నేప‌థ్యంలో ఆయ‌న మృతిపై రాష్ట్ర స్థాయి ద‌ర్యాప్తు కాకుండా..సీబీఐతో విచార‌ణ చేయాల‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ హైకోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి తాజాగా తెలంగాణ హోం శాఖా కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. న‌యీం వ్యవహారంలో 175 కేసులు నమోదు చేసి, 16 ఛార్జిషీట్లు దాఖలు చేశామని హోంశాఖ తెలిపింది. నయీంకు అన్ని పార్టీల నేతలతో సంబంధాలున్నాయన్న ఆరోపణ నిజం కాదని ఈ సంద‌ర్భంగా వివ‌రించింది. అంతేకాకుండా  ఇతర రాష్ట్రాల నక్సల్స్‌ - దావూద్‌ ఇబ్రహీంతో నయీంకు సంబంధాలపై ఆధారాల్లేవని తెలంగాణ‌ హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు త‌న ప‌రిధిలోని పోలీసుల‌కు కూడా ఈ మాజీ ముఠా నాయ‌కుడితో సంబంధం లేద‌ని హోం శాఖ తెలిపింది. నయీంను వాడుకొని పోలీసులు లబ్ధి పొందారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు-నాయకులను సిట్‌ కాపాడుతోందనడం సరికాదని హోం శాఖ వివ‌ర‌ణ ఇచ్చింది. నయీంను వాడుకుని పోలీసులు లబ్ది పొందారనడానికి ఆధారాల్లేవని, పది మంది పోలీసులకు నోటీసులిచ్చి విచారణ జరిపామని హోంశాఖ వివ‌రించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News