సీపీఐ సీనియర్ నేత - ప్రస్తుత జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ - తెలంగాణల ముఖ్యమంత్రలు చంద్రబాబు, కేసీఆర్ లను ఏకేశారు. అదేసమయంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపైనా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విబజన తర్వాత కేంద్రం ఏపీ - తెలంగాణలకు అటు ఆర్థికంగా ఇటు రాజకీయంగా కూడా ఎంతో చేయాల్సి ఉందని, సంస్థల కేటాయింపు, కొత్తవాటి నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, కానీ, ఏపీ సీఎం కానీ - తెలంగాణ సీఎంకానీ కేంద్రంపై ఒత్తడి తెచ్చి వాటిని సాధించుకోవడంలో తీవ్రంగా వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం ముందు తలవంచి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు తోక ఆడిస్తున్నారని విరుచుకుపడ్డారు.
ఇక, ఈ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు కూడా ఈ సీఎంలు పెద్ద ఎత్తున నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రావాల్సిన నిదులు రావడం లేదని ఇక్కడ మొసలి కన్నీళ్లు కారుస్తూ.. అన్యాయం జరుగుతోందని వాపోతున్నారని, అసలు.. కేంద్రాన్ని నిలదీయకుండా ఏదీ సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసిందేనని అయినా ఈ సీఎంల నాటకాలు ఆగడం లేదని ఎద్దేవాచేశారు. ఈ మేరకు నారాయణ ఆదివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఏపీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. పోలవరం ప్రస్థావన తెచ్చిన ఆయన 2019 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాటలు ఆచరణలో సాధ్యంకావని అన్నారు.
నిర్వాసితులకు న్యాయం జరగకుండా ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తికి తాము చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంటే, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అధికార పార్టీ నేతలు విమర్శించడం సమంజసం కాదన్నారు. పెట్టుబడుల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి.. ఇప్పటివరకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సులు ఫలితం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో వరుస ఆత్మహత్యలు ఆగాలంటే విద్యాశాఖ నుంచి గంటా శ్రీనివాసరావును తప్పించాలని డిమాండ్ చేశారు.