ఆంధ్రోళ్లను మోసం చేసిన ముగ్గురు మూర్ఖులు
పదునైన మాటలతో విరుచుకుపడే నేతల్లో సీపీఐ నారాయణ ఒకరు. దూకుడు రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.. ఈ వృద్ధ కామ్రేడ్ మాటలు మాత్రం మరింతగా మంటలు పుట్టించేలా ఉంటాయి. రాజకీయంగా తాను తప్పు పట్టే వారికి మర్యాద ఇచ్చేందుకు ఏ మాత్రం ఇష్టపడని నారాయణ.. తిట్టే విషయంలో అస్సలు వెనుకాడరు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల గురించి..వారి ఈతి బాధల గురించి కనీసం నోరు విప్పటానికి ఇష్టపడని ఈ పెద్దమనిషి.. ఇప్పుడు ఆంధ్రా మీద అంతులేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. విభజన సమయంలో ఇద్దరికి మేలు జరిగేలా చేయాలన్న మాటను మాట వరసకు చెప్పటానికి పెద్దగా ఇష్టపడని వ్యక్తి.. ఇప్పుడు ఆంధ్రా ప్రయోజనాల కోసం ఎంతటి వారినైనా తిట్టిపోస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
విభజనకు ముందే తన తీరుతో మోసం చేసినట్లుగా విమర్శలు ఉన్న నారాయణ.. విభజన తర్వాత ఆంధ్రోళ్లను మోసం చేసిన వారి గురించి పెద్ద ఎత్తున మాటలతో విరుచుకుపడుతున్నారు. ఏపీ విభజన తర్వాత ముగ్గురు మూర్ఖులు మోసం చేశారంటున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు మూర్ఖులు ఎవరో కాదని.. ఒకరు ప్రధాని మోడీ.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. సీఎం చంద్రబాబు అని మండిపడుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సార్వత్రిక ఎన్నికల్లో ఈ ముగ్గురిని నమ్మటమేకాదు.. వారి తరఫున ప్రచారం చేసే బాధ్యతను తన భుజాన వేసుకున్న పవన్ కల్యాణ్ ను చిన్న మాటను కూడా నారాయణ అనకపోవటం గమనార్హం. గతంలో అవకాశం వచ్చిన ప్రతిసారీ మాటలతో పవన్ ను గుచ్చేసే నారాయణ ఇప్పుడు మాత్రం పల్లెత్తు మాట అనకపోవటం గమనార్హం. ఏపీని మోసం చేసిన ముగ్గురు మూర్ఖుల విషయంలో ప్రజలు జాగరూకతో ఉండాలని చెబుతున్నారు.
పెద్దనోట్ల రద్దు పేరిట తీసుకున్న నిర్ణయంలో కార్పొరేట్లకు రూ.1.60 లక్షల కోట్లు దోచిపెట్టే నిర్ణయాల్ని మోడీ తీసుకున్నారని.. ఇందుకు ప్రజా కోర్టులో ప్రధాని మోడీకి శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. అన్నీ బాగున్నాయి కానీ.. ఆంధ్రోళ్ల విషయంలో నారాయణ గతంలో వ్యవహరించిన దానిపై వివరణ ఇవ్వరా? ఎదుటోళ్లను తప్పు పట్టే ముందు.. మనమేం చేశామన్న ఆలోచన ఉంటే కాస్త అయినా బాగుంటుంది. నిత్యం తప్పులు ఎంచే నారాయణకు ఆయన చేసిన తప్పుల్ని గుర్తు చేయాల్సి రావటం ఏమిటో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/