ఈయన కమ్యూనిస్టు.. ఆయన శాడిస్టు!

Update: 2016-11-22 11:04 GMT
నోట్ల రద్దు వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఆర్బీఐ కొత్త గవర్నరు ఉర్జీత్ పటేల్ మెడకు చుట్టుకుంటోంది.  ఈ విషయంలో ప్రధానిని శభాష్ అంటున్నవారంతా ఉర్జీత్ పై మండిపడుతున్నారు. తాజాగా సీపీఐ నేత నారాయణ అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ ఓ శాడిస్టు అని - ఆయన్ని పదవి నుంచి తప్పించాలని నారాయణ వ్యాఖ్యానించారు.

పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ తిరుపతిలోని ఎస్ బీఐ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు సీపీఐ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అనంతరం బ్యాంకు ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ - ముందుచూపు లేకుండా - ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పెద్దనోట్లను రద్దు చేశారని మండిపడ్డారు. దీనిపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.

దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించిన ప్రధాని మోదీకి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఆర్బీఐ గవర్నరును శాడిస్టుతో పోల్చిన నారాయణ... ఆయన్ను ఆ పదవిలో కొనసాగించడం ఏమాత్రం కరెక్టు కాదంటూ రంకెలు వేశారు. రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News