వరుస నిరసనలు నిర్వహించటం కామ్రేడ్లకు అలవాటే. తాజాగా అలాంటి నిరసన చేసే క్రమంలో అనుకోని రీతిలో గాయపడ్డారు సీపీఐ నారాయణ. ఇటీవల కాలంలో ఏపీలోని విశాఖ మహానగరంలో వెలుగు చూస్తున్న భూకబ్జా మీద నిరసన కోసం విశాఖకు వచ్చారు నారాయణ. మధురవాడకు దగ్గర్లోని 22 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారు. ఈ భూమిని పరిశీలించేందుకు కార్యకర్తలతో వెళ్లిన ఆయన... అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ గోడను అదే పనిగా కాలితో కొట్టటం మొదలు పెట్టారు. పలుమార్లు అదే పనిగా కొడుతున్న నారాయణ కాలి దెబ్బలకు ఫెన్సింగ్ కు చెందిన రెండు పలకలు విరిగిపోయింది. ఆ క్రమంలో వాటి మధ్యలో నారాయణ కాలు ఇరుక్కుపోయింది.
ఊహించని పరిణామంతో షాక్ తిన్న కార్యకర్తలు వెంటనే స్పందించి.. రెండు పలకల మధ్య ఇరుక్కున్న నారాయణ కాలును బయటకు తీశారు. వెంటనే ఆయన్ను.. ఘటనాస్థలానికి దగ్గర్లోని నర్సింహోంలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. కాలికి దెబ్బ తగిలిన చోట చికిత్స చేసిన వైద్యులు.. ఎక్స్ రే తీసి.. గాయం తీవ్రత ఎంతన్నది గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నిరసన చేసేటప్పుడు మరీ అంత ఆవేశం అవసరం లేదేమో నారాయణజీ!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/