నోట్ల రద్దుపై నారాయణ మాట...

Update: 2016-11-10 05:08 GMT
వీలైనంతవరకూ సంచలన ప్రకటనలు చేయడంలో తనదైన శైలిని చూపించే ప్రయత్నం చేసే సీపీఐ జాతీయ కార్యదర్శి నారయాణ మారోసారి సంచలన ప్రకటన చేశారు. తాజాగా రూ.500 - 1000 నోట్ల రద్దు విషయంలో చేసిన పని నల్లధనాన్ని నియంత్రించడానికని కేంద్రం చెబుతున్న వేల ఈ విషయాన్ని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ స్వాగతిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేవలం కొత్తనోట్లు రావడం - పాతనోట్లు రద్దుచేయడం అనే ఈ ఒక్క నిర్ణయం తోనే నల్లధనం బయటకు రాదని అభిప్రాయపడ్డారు. అక్కడితో ఆగితే నారాయణ ప్రత్యేక ఏముంది... దాంతో ఎండీఏ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి సీపీఐ కార్యాలయంలో మాట్లాడిన నారాయణ... నెల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడం, అనంతరం కొన్ని రోజుల తర్వాత ప్రధాని అకస్మాత్తుగా ప్రకటన చేయడాన్ని బట్టి వాళ్ల (ఎన్డీఏ) కొంపలు సర్దుకున్న తర్వాతే నోట్ల రద్దు ప్రకటన చేసినట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. మోడీ నిర్ణయం వల్ల పేద - చిల్లర వర్తకులకు నష్టం వాటిల్లి పెద్దపెద్ద మాల్స్ - వ్యాపార సంస్థలు భారీగా బాగుపడతాయని, దేశంలోని కార్పొరేట్ కంపెనీల లూటీని అరికడితేనే నల్లధనం నియంత్రణ సాధ్యమని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో వివాహాలు - చిన్నచిన్న కార్యక్రమాలకు జనం వెళ్లలేని పరిస్థితులు ఎదురవుతాయన్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాగా.. ఈ విషయం కేవలం ఆర్బీఐ కి - ప్రధాని మోడీ - ఫైనాన్స్ మినిస్టర్ - మరికొంతమంది కీలక వ్యక్తులకు తప్ప మరెవరికీ తెలియదని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News