రూ.500 - రూ.1000 వెయ్యినోట్లను రద్దు చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొత్త కోణంలో విశ్లేషించారు. నోట్ల రద్దును సుదీర్ఘంగా విశ్లేషించిన నారాయణ ఈ మేరకు వెల్లడించిన తన అభిప్రాయంలో ప్రధాన నిర్ణయం వెనుక పారిశ్రామిక వేత్తలకు కొత్త కోణంలో మేలు చేసే ఎత్తుగడ ఉందని పేర్కొన్నారు. కరెన్సీ రద్దు పేరుతో సామాన్య ప్రజల నుండి బలవంతంగా డిపాజిట్లను సేకరించి బడా వ్యాపారవేత్తలకు రుణాలుగా ఇవ్వటానికి వేసిన పధకం ఇదని ఆరోపించారు. ఇలాంటి చర్యలు విజయ్ మాల్యా వంటి వారికి ఊతం ఇవ్వకుండా మరేం చేస్తాయని నారాయణ ప్రశ్నించారు.
నోట్ల రద్దుపై నారాయణ ఆగ్రహం ఇలా ఉంది... "పెద్దనోట్ల రదు ఆకస్మిక ప్రకటనతో నల్లధనంపై యుద్ధం ప్రకటించానని మోడీ జబ్బలు చరుచుకున్నారు. నిజానికి ఈ యుద్ధం సామాన్యుడిపై ప్రకటించబడింది పనులు మానుకుని బ్యాంకులవద్ద పడిగాపులు కాసూ తమ వద్ద ఉన్న పెద్దనోట్ల నగదు రూపంలో ఉన్న కొన్ని వేల రూపాయల నల్లధనాన్ని గడువు లోపల మార్చుకోవటానికి ప్రజలు నానా పాటు పడుతున్నారు. ఆ రద్దీకి తట్టుకోలేక-పనులకు వెళ్ళలేక నానా అవస్థలు పడుతున్నారు. మరొక పక్కన బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలవుతోంది. అనేక మంది ఆర్థిక నిపుణులు ఇప్పటికే ఈ కరెన్సీ రదు చర్యల వలన పెద్దగా ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. అసలు మన దేశంలోనల్లధనం ఎంత ఉంది, అది ఏ రూపంలో ఉన్నది - ఎక్కడ ఉన్నది - ఎవరి వద్ద ఉన్నది - దానిని వెలికితీయటానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న విషయంలో పూర్తిగా బాధ్యతారహితంగా మోడీ వ్యవహరించినటుగా రానురాను స్పష్టం అవుతోంది. వెలువడుతూన్న వార్తలను బట్టి గత ఆరునెలలుగా ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో మోడీ ఇటువంటి చర్య తీసుకున్నప్పటికీ అనేక మంది ఆర్థిక నిపుణులు దీనిపట్ల ఆసక్తి చూపలేదని స్పష్టం అవుతోంది. మొదటగా మోడీ చేసిన ప్రకటనలో నల్లధనాన్ని వెలికి తీయటానికి ఉగ్రవాద శక్తులు మన దేశంలోకి రహస్యంగా చేర్చే దొంగనోట్లను అరికట్టటానికి ఈ చర్యను తీసుకున్నటుగా చెప్పుకున్నారు. దొంగనోట్ల విషయంలో ఊహాగానాలను పక్కనబెట్టి అధికారిక లెక్కలను బట్టి చూస్తే ప్రతి లక్ష పెద్దనోట్లలో వరకూ దొంగనోటు చలామణీలో ఉన్నటుగా లెక్క తేలింది అంటే మనదేశంలో ఉన్న పెద్దకరెన్సీలో ఇది మాత్రమే నల్లధనం విషయానికి వస్తే మనదేశంలో ఏటా లక్షల కోట్లకు పైబడి నల్లధనం ఉత్పత్తి అవుతోందని అధికారిక లెక్కలు ఫైనాన్స్ సంస్థల అంచనాలు వెల్లడిస్తున్నాయి"అని విశ్లేషించారు.
"ఈ నల్లధనం సామాన్య ప్రజల వద్ద తయారు కావటం లేదు. ఉద్యోగులు చిన్నచిన్న వ్యాపారులు కూలీనాలీ చేసుకుని బ్రతికేవారు.వీరికి నల్లధనంతో పని ఏమిటి, రోజగడవటమే కష్టంగా ఉంటే పన్నులు ఎగవేసి డబ్బులు ఎలా దాచుకుంటారు, ఇక రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, బూర్జువా రాజకీయ నాయకులు వారితో కుమ్మక్కైన అవినీతి అధికారులు వీరి దైనందిన లావాదేవీలలో నల్లధనం ప్రముఖ పాత్ర వహిస్తుంది అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ప్రభుత్వానికి లెక్కచూపకుండా పన్నులు ఎగవేసి కూడబెట్టిన నల్లధనాన్ని ఎవరూ నోట్ల రూపంలో పరుపుల క్రింద ఇనప పెట్టెల్లోనూ దాచరు అట్లా దాచే డబ్బు వారికి నిరుపయోగమే. విదేశీ బ్యాంకుల్లో నిల్వ చెయ్యబడిందని తెలుస్తోంది ఆ ధనాన్ని వెనక్కుతెచ్చి ప్రజలందరికీ తలకు లక్షల చొప్పున 15 పంచుతానని మోడి పలికిన డాంబికాలు నీటిమూటలని వేరే చెప్పనవసరం లేదని నారాయణ ఎద్దేవా చేశారు. అయితే ఆ నల్లధనాన్ని మరొక రూపంలో మనదేశంలోకి తేవటానికి ఇప్పుడు మోడీ అతనికి ముందు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నారని ఎంతమందికి తెలుసు? అయితే ఈ డబ్బు తెచ్చేది ప్రజలకోసం మాత్రం కాదు. విదేశీ పెటుబడిగా రూపాంతరం చెంది మన ధనికవర్గాలవారు విదేశాల్లో దాచిన డబ్బు రౌండ్ ట్రిప్పింగ్, అంటే డొంకతిరుగుడు, పద్దతిలో తిరిగివస్తోది అట్లా వచ్చిన ప్రతీ రూపాయికి 25 రూపాయల పన్ను వెసులుబాటులు, ఇతర సబ్సిడీల రూపంలో ముట్టజెపుతోంది. మన ఇంటిలోనుండి దొంగిలించిన డబ్బును దొంగ తిరిగి మనకే అధిక వడ్డీకి అప్పుఇచ్చినటుగా ఉన్నది ఈ ప్రహసనం మన రాజకీయ నాయకులు విదేశీ పెటుబడి పైన అంత మమకారం అత్యంత ఉత్సాహం చూపించటానికి చిటికేస్తే విదేశీ పర్యటనలు చేయటం వెనుక రహస్యం ఇదే. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోడీ డాంబికాలు పలుకుతున్నాడు. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో లబ్ది పొందటం కోసం నల్లధనం పై కొరడా రుళిపించానని ప్రజలను మభ్యపెట్టటం" అని మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/