అలూలేదు సూలు లేదు మొగుడిపేరు సోమలింగం అని ఊరికే అనలేదేమో? ఎప్పుడు ఎన్నికలు.. ఎప్పుడు జత కట్టేది? అన్న దానిపై ఇప్పుడే మాట చెప్పేస్తున్నారు కామ్రేడ్స్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎవరో ఒకరికి తోక పార్టీగా ఉండేందుకు కామ్రేడ్స్ ప్రదర్శించే ఉత్సాహం అంతా ఇంతా కాదు.
ప్రతి ఎన్నికల్లోనూ ఎవరో ఒకరితో.. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవటం చేస్తుంటారు. ఈ తీరు ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తేలా చేస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ తో పొత్తు పెట్టుకోవటానికి తాము ఓకే చెబుతున్నట్లుగా చెబుతున్నారు సీపీఐ ఏపీ రాష్ట్రకార్యదర్శ రామకృష్ణ మాట్లాడుతూ.. పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలు తమ ఆలోచనలకు దగ్గరగా ఉన్నట్లు రామకృష్ణ చెప్పారు. తమ ఆలోచనా విధానంతోనే ఆయన నడుస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు దేశంలో.. రాష్ట్రాల్లోనూ రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు.
ఏపీ రాష్ట్ర పరిస్థితులపై చర్చ జరిపిన అనంతరం ఒక స్పష్టతకు వస్తానని చెప్పారు. కూటమిలో ఎవరు ఉండాలి? ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. ప్రధాని మోడీ ఏపీని పూచిక పుల్లగా కూడా లెక్క చేయటం లేదని తప్పు పట్టారు. అంతా బాగానే ఉంది కానీ.. ఏపీలో పవన్ కే సరిగా దిక్కులేదన్న విమర్శ వినిపిస్తున్న వేళ.. ఈ తోకల్ని తగిలించుకొని తిరిగితే ఎలాంటి లాభం లభిస్తోందన్నది కాలమే నిర్ణయించాలి.