రేషన్ కార్డు సహజంగా ఎవరికి ఉంటుంది? మధ్యతరగతి ఇంకా చెప్పాలంటే సామాన్యులకు మాత్రమే తెల్లరేషన్ కార్డు ఉంటుంది. కానీ పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సదరు పేద వర్గాల కార్డు వచ్చేలాగా ఉందంట. బాబు తనయుడు - టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన ప్రయత్నం ఈ అభిప్రాయాన్ని కలిగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అభిప్రాయాపడ్డారు. చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తులను, అప్పలను ఆయన తనయుడు లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో రామకృష్ణ ఈ సందేహం లేవనెత్తారు.
65 సంవత్సరాల వయస్సున్న చంద్రబాబు పేరున ఉన్న ఆస్తి విలువ రు.3.78 కోట్లుంటే - అప్పు రు.3.06 కోట్లుగా చూపడం వాస్తవ విరుద్ధంగా ఉందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. పైగా చంద్రబాబు మనుమడు దేవాంశ్ ఆస్తి మాత్రం రు.9.17 కోట్లుగా చూపడం బట్టి చూస్తే మొన్న పుట్టిన దేవాంశే షావుకారుగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. అంటే చంద్రబాబు కంటే మనుమడు కోటీశ్వరుడా అనుకోవాలా? అని రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఆడిటర్ అంకెల మాంత్రికుని అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకన్నా ఆయన మనుమడు దేవాంశ్ నే కోటీశ్వరునిగా చూపి అంకెల గారడీ చేయడం చూస్తుంటే తండ్రికి తెల్ల రేషన్ కార్డు ఇప్పించేట్టుగా ఉన్నారని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల ఆస్తుల ప్రకటన ఆదర్శవంతంగా ఉండాలే తప్ప అపహాస్యంగా మారకూడదని అభిప్రాయపడ్డారు. లోకేష్ వార్తలను విన్న సాధారణ ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారేగానీ, ఎవరూ నమ్మడం లేదని స్పష్టం చేశారు. అంకెల గారడీలో చంద్రబాబుని లోకేష్ మించిపోతే, లోకేష్ ను వారి ఆడిటర్ మించిపోయినట్లున్నదని వ్యాఖ్యానించారు. అంకెల గారడీ చేసిన చంద్రబాబు ఆడిటర్‌ను, ఆయన కుటుంబ అభినందించాలని అన్నారు.
ఆస్తులు - అప్పులు వెల్లడిలో చిత్తశుద్ధితో నిజమైన వివరాలు తెలియచేసి అందరికీ ఆదర్శంగా ఉండాలని రామకృష్ణ హితవు పలికారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/