బ్లాక్ మనీపై చ‌ర్చ‌కు ప్ర‌త్యేక అసెంబ్లీ!

Update: 2016-10-14 13:09 GMT
నల్లధనం వెల్లడికి సంబంధించి అంశం దేశం కంటే రాష్ట్రంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. హైద‌రాబాద్‌ కు చెందిన ఓ వ్య‌క్తి రూ.10 వేల కోట్లకు సంబంధించి ప‌న్ను చెల్లించార‌ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్ర‌క‌ట‌న ఈ చ‌ర్చ‌కు బీజం వేసింది. అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహనరెడ్డి ఏకంగా ప్ర‌ధాన‌మంత్రికే రాసిన లేఖ ఈ వేడిని మ‌రింత‌గా పెంచింది. ఈ ఇద్ద‌రు నేత‌ల ప్ర‌క‌ట‌న‌ల నేప‌థ్యంలో సీపీఐ రాష్ట్ర  కార్యదర్శి  రామకృష్ణ అధికార‌ - ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై తీరుపై మండిప‌డ్డారు. న‌ల్ల‌ధ‌నం వెల్ల‌డించ‌డంపై కీల‌క నేత‌లు ఇద్ద‌రు చేస్తున్న ప్రకటనలపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీ సమావేశాలు జరపాల‌ని డిమాండ్ చేశారు. దీంతోపాటుగా అఖిల‌ప‌క్ష సమావేశం నిర్వహించాలని ఆయ‌న కోరారు.

నల్లడబ్బు నీది అంటే నీదని ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు - ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న ఆరోపణలు వారే నిరూపించాలని రామ‌కృష్ణ‌ డిమాండ్ చేశారు. అలా జరగనట్లయితే తప్పడు ఆరోపణలు చేస్తున్న ఇద్దరు నాయకులను ప్రజలు అసహ్యహించుకునే ప్రమాదం ఉంద‌ని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చిన విధంగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నల్లధనం అంశాన్ని కూడా గాలికొదిలేస్తారేమోనని రామ‌కృష్ణ అనుమానం వ్యక్తం చేస్తున్నాం. వందరోజుల్లో విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తెప్పిస్తామని చెప్పిన ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోడీ విఫలమైనా ఆయన్ను అభినందించడం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు.  గత కొంతకాలంగా రాష్ట్రంలో డబ్బు చుటూ రాజకీయాలు తిరుగుతున్న క్రమంలో కోటీశ్వరులు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం వారే చట్టాల్ని శాసిస్తున్నార‌ని అన్నారు. పాలకపార్టీలు నల్లధన కుబేరులతో కుమ్మక్కైన ఫలితంగానే అక్రమ లావాదేవీలు కొనసాగుతున్నాయని రామ‌కృష్ణ త‌ప్పుప‌ట్టారు. నల్లధనం - అక్రమ ఆస్తులు ఎవరివైనాసరే జప్తు చేసేందుకు చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News