రోడ్ మ్యాప్ ఇపుడు ఏపీలో ఏ నేత నోట విన్నా వినిపించే మాట. రోడ్ మ్యాప్ అంటూ ఆవిర్భావ సభలో చేసిన కామెంట్స్ కొన్ని క్షణాల్లోనే తెగ వైరల్ అయ్యాయి. ఆ తరువాత దీని మీద ప్రతీ రాజకీయ పార్టీ ఏదో సందర్భంలో చర్చిస్తూనే ఉంది. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే వైసీపీని దించేస్తామని పవన్ నాడు సభా ముఖంగా చెప్పేశారు.
అయితే రెండు నెలల క్రితమే రోడ్ మ్యాప్ అమిత్ షా ఇచ్చేశారని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కూడా దీని మీద ఏ మాత్రం సాగదీయకుండా క్లారిటీ ఇచ్చేశారు. మరి ఆ విషయం పవన్ కి తెలియదా అంటే పవన్ అడుగుతోంది బీజేపీతో టీడీపీని కలుపుకునే సరికొత్త రోడ్ మ్యాప్ అని మరో వైపు వైసీపీ నేతలు అంటున్నారు.
ఇదిలా ఉండగా బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడమేంటి, పవన్ దాన్ని ఫాలో అవడం ఏంటి ఇప్పటికే కామ్రేడ్స్ గుస్సా అవుతున్నారు. పైగా కూటమి పేరిట తమను పిలిస్తే బీజేపీ ఉన్న వైపు మేము వస్తామా అని కూడా అంటున్నారు.
దీని మీద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ తాజాగా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బీజేపీ రోడ్ మ్యాప్ జగన్ కి ఏనాడో ఇచ్చేసింది అని ఆయన కొత్త విషయాన్నే చెబుతున్నారు. జగన్ ఆ రోడ్ మ్యాప్ ని తుచ తప్పకుండా ఇప్పటికే ఫాలో అవుతున్నారని, విషయం అంత క్లియర్ గా ఉండగా పవన్ రోడ్ మ్యాప్ తనకు కావాలని బీజేపీ వారిని అడగడం ఏంటి అని ప్రశ్నించారు.
పవన్ తొందరలో వాస్తవాలు తెలుసుకుంటారని ఆయన అంటున్నారు. ఇక ఏపీలో ఒక్క వైసీపీనే కాదు, బీజేపీకి వ్యతిరేకంగా కూడా కూటమి కట్టాలని ఆయన పవన్ని కోరారు. పవన్ తొందరలోనే బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వస్తారని కూడా జోస్యం చెప్పారు. మొత్తానికి చూస్తే ఏపీలో రేపటి రోజున ఏం జరగబోతోంది అన్న దాని మీద సీపీఐ రామక్రిష్ణ మంచి క్లారిటీతో ఉన్నారనే అనుకోవాలి. మరి రామక్రిష్ణ చెప్పినట్లుగా పవన్ బీజేపీకి రాం రాం అనెస్తారా. అలా అయితే ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు బాటలు పడినట్లే.