కృష్ణాజిల్లా మచిలీపట్నంలో లక్షా ఐదువేల ఎకరాలను భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సేకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించడం వివాదాలకు కారణంగా మారుతోంది. బాబు సారథ్యంలో జరిగిన ఈ నిర్ణయంపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఏకంగా బాబుకు పిచ్చిపట్టిందని తేల్చేశారు.
రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మచిలీపట్నం పోర్టుకు 2వేల ఎకరాలు సరిపోతుందన్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా లక్ష ఎకరాలు సేకరిస్తారని ప్రకటించడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎక్కడ భూములు కనిపించినా సరే, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ నిర్ణయాలు చూస్తుంటే చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టుకుందని అర్థమవుతోందని రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు ప్రభుత్వ విధానాలపై తాము పోరాటం చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా చంద్రబాబు భూ దోపిడీపై మిగతా 10 వామపక్ష పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలిపారు.
ఇదిలాఉండగా రాజధాని సమీపంలోని సదావర్తి సత్రం భూముల కొనుగోళ్లలో టీడీపీ పెద్దల హస్తం ఉందని రామకృష్ణ ఆరోపించారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్స్ సర్వేను ఆయన తప్పుపట్టారు. సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికే ఈ సర్వే నిర్వహిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలు తిరగబడే రోజులు రానున్నాయని రామకృష్ణ తెలిపారు.