ప్రత్యేక హోదా కేంద్రంగా అటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా ఇటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టార్గెట్ గా విభజన హామీల సాధన సమితి ఆందోళనను ఉధృతం చేసింది.గతంలో ప్రకటించిన విధంగానే రక్తం సేకరించి ప్రధానమంత్రికి పంపించింది. ఈ సందర్భంగా నాయకులు ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు దమ్మంటే ప్రత్యేక హోదా ఎప్పడో వచ్చేదని వ్యాఖ్యానించారు. రక్తాన్ని అయినా చిందించి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ ఏపీకి మట్టి - నీళ్లు ఇచ్చి వెళితే...తాము రక్తాన్నే చిందిస్తామని ప్రకటించారు. హోదా ఇవ్వకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని - ప్రజ్ఞాప్రతినిధుల్ని తిరగనివ్వమని హెచ్చరించారు.
రక్తదాన శిబిరం ప్రారంభ సభలో హోదా - విభజన హామీల సాధన సమితి కన్వీనర్ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ...రాష్ర్టానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఇప్పటికే వివిధ రూపాల్లో దశలవారీగా పోరాటం చేశామని, అయినా కేంద్ర, రాష్ట్ర పాలకుల్లో ఏమాత్రం చలనం లేదని మండిపడ్డారు. అందుకే రాష్ట్ర ప్రజల ఆవేదన - ఆగ్రహం - బాధ - సహనం తెలియజేయడం కోసం రక్తాన్నిచిందించడానికి సిద్ధమయ్యామని అన్నారు. రాష్ట్రం కోసం తామంతా రకాన్ని ఇస్తున్నామని, ఈ రకాన్ని మోడీకి పంపి ఆయన కళ్లు తెరిపిస్తామని హెచ్చరించారు. గత సంవత్సరం ఆగస్ట్ నెలలో రాష్ట్రమంతా పాదయాత్రలు - బస్సు యాత్రలు - ఆగస్ట్ 11న తొలిసారిగా రాష్ట్ర బంద్ చేసిన సందర్భంగా అరెస్ట్ అయ్యి జైళ్లకు వెళ్లామని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు హోదా గురించి మాట్లాడుతున్నాయని, జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే మాట్లాడారని, ఇంత జరుగుతున్నా మోడీలో ఎందుకు మార్పు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అల్టిమేటం జారీ చేశామని ఒక్క మాట చెప్పి తప్పించుకుంటున్నాడని, చంద్రబాబుకు దమ్ముంటే ప్రత్యేక హోదా ఎప్పడో వచ్చేదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఇప్పటికే విలువలైన కాలం వృధా అయిపోయిందని, ఇకపై హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ప్రకటించి రూ. 16,000 కోట్లు లోటుబడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, బుందేల్ఖండ్ ప్రాజెక్టు తరహాలో రాష్ట్రాలకు ప్యాకేజీలు ఇవ్వాలని కోరారు. ఇకపై మంత్రుల్ని ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తాం, రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా నల్లబ్యాడ్డీలతో నిరసన తెలియజేసి, నియోజకవర్గాల్లో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు.
హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని మోడీ రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తాడనుకుంటూ మురికినీళ్లు-మట్టి ఇచ్చి పోతే తాము రక్తం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. తమకిచ్చిన హామీలు అమలు చేయండని ఇప్పటికే ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇంకా ఏ స్థాయిలో ఉద్యమాలు చేస్తే దిగొస్తారని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం లక్షలాది విద్యార్థులు డిగ్రీలు చేసి బయటకొస్తున్నారని - ఉపాది - ఉద్యోగాలు లేక ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా అని ఆవేదన చెందుతున్నారన్నారు. ఇప్పటికైనా మోసపూరిత విధానాలు విడనాడండి ప్రత్యేక హోదా ఇవ్వండి లేదా ఇదే తరహాలో రాష్ట్ర మంతా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి నిరసనలు తెలియజేస్తామని చలసాని హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ప్రాణవాయువని, హోదాతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులకు - యువతకు భవిష్యత్ ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే అనేక పోరాటాలు సాగించామని, ఇప్పటికైనా మీ జిమ్మిక్కులు ఆపి హోదా ప్రకటించాలని లేదా ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదిలాఉండగా సేకరించిన రకాన్ని డీటీడీసీ కొరియర్ ద్వారా ప్రధాని మోడీకి పంపించారు.