నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తన కార్యాలయంలోకి ప్రవేశించిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. గతంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉండగా ఇంత దారుణంగా రాజకీయాలు లేవని - చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుండే రాజకీయాలు డబ్బు చుటూ తిరగడం ప్రారంభమైందని మండిపడ్డారు. అయితే ఆ విషయాన్ని పక్కనపెడుతూ...సీఎం స్థానంలో ఎవరో ఉన్నట్లు - రాజకీయాల్ని ఎవరో దిగజార్చుతున్నట్లు - సమాజం ఏదో అయిపోతున్నట్లు - చూస్తూ ఏమీ చేయలేక బాధపడిపోతున్నట్లు చంద్రబాబు పెద్ద బిల్డప్ ఇచ్చారని మండిపడ్డారు. రాజకీయాలను భ్రష్టుపట్టించిందీ - రాజకీయాలతో వ్యాపారం చేస్తున్నదీ చంద్రబాబేనని విమర్శించారు.
విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగిన అనంతరం రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించి - తీసుకున్న నిర్ణయాలను రామకృష్ణ వివరించారు. ధన రాజకీయాలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబేనని అన్నారు. సంతలో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్సీకోసం ఓట్లు కొన్న మనిషి రాజకీయాల్లో విలువ గూర్చి నీతులు వల్లించడం తగదని రామకృష్ణ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు - వైఎస్ రాజశేఖరరెడ్డి ఇద్దరూ రాజకీయాలను వ్యాపారం చేసి - విలువల్ని దిగజార్చారని నిశితంగా విమర్శించారు. ఈరోజు చంద్రబాబు సిగ్గులేకుండా నంగనాచి కబుర్లు చెబుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవాలంటే కోట్ల రూపాయలు కుమ్మరించాల్సిన పరిస్థితి తీసుకువచ్చారని విమర్శించారు. ఎమ్మెల్యేల దోపిడీ - అవినీతి కార్యకలాపాలు తారాస్థాయికి చేరాయని, ఇసుక దోపిడీకి సంబంధించి ఓ మహిళా ఎమ్మార్వో ఎంఎల్ ఏని ప్రశ్నిస్తే ఆమెపై దాడి చేశాడని, ఈ విషయమై ఎంఎల్ ఏను ప్రశ్నించే స్థాయిలో కూడా ముఖ్యమంత్రి లేడని రామకృష్ణ మండిపడ్డారు. రూ. 5 కోట్ల ఓ ఎమ్మెల్యే డిమాండ్ చేశాడని కాంట్రాక్టర్ చెబితే చంద్రబాబు ఏమాత్రం చర్య తీసుకోలేదన్నారు. పైగా రాజకీయాల్లో విలువల గురించి శ్రీరంగనీతులు వల్లిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతి - ధన రాజకీయాలకు వ్యతిరేకంగా ఇతర పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు. చంద్రబాబుకు రాజకీయాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాబోయే ఎన్నికల నాటికైనా ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయకుండా ఎన్నికల్లో పాల్గొనాలని - కనీసం స్థానిక సంస్థల్లోనైనా నీతిగా ఎన్నికల్లో గెలవాలని సవాల్ చేస్తున్నామని రామకృష్ణ అన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా భూ సమస్యలు తలెత్తుతున్నాయని రామకృష్ణ విమర్శించారు. బందరు పోర్టు నిర్మాణానికి భూమి తీసుకునే విషయంలో 29 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించి - వేలాది ఎకరాలు సమీకరించడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. పోర్టు నిర్మాణానికి 4,800 ఎకరాలు సరిపోతాయని, సమీపంలోనే 11 వేల ఎకరాలు ప్రభుత్వం బంజరు భూమి ఉందని, దాన్ని వదిలేసీ పరిశ్రమల పేరుతో రైతుల భూములు కాజేయడానికి కుట్ర చేస్తున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. రైతులు రోడ్డున పడే పరిస్థితే కాకుండా గ్రామాలు గ్రామాలే తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. మొత్తంగా నాలుగు లక్షల ఎకరాలు గుర్తించి - తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ఇతర వామపక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/