ప‌వ‌న్‌ తో ప‌నిచేసేందుకు వారు రెడీన‌ట!

Update: 2016-10-17 09:56 GMT
ఆక్వాపార్క్ ఏర్పాటుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వినిపించిన గ‌ళం ప్ర‌తిప‌క్షాల‌ను ఒక్క‌తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు అవ‌కాశంగా మారుతోంది. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విధానాల‌పై త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేసే సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ట తాజాగా ప‌వ‌న్ కామెంట్లు అండ‌గా బాబుపై మండిప‌డ్డారు. ఆక్వాపార్క్ ఏర్పాటుకు అటు ప‌వ‌న్ కానీ ఇటు తాము కాని వ్యతిరేకం కాదని చెప్పిన రామ‌కృష్ణ‌ జనావాసాలు లేని ప్రాంతంలో పార్క్‌ ను ఏర్పాటు చేయాలని కోరారు. కానీ అక్క‌డే పెడ‌తామ‌ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప‌ట్టుబ‌ట్ట‌డం చూస్తుంటే ఆయ‌న‌కు భూమి పిచ్చిపట్టిన‌ట్లుంద‌ని రామ‌కృష్ణ మండిప‌డ్డారు.

ఢిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయంలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్న అనంత‌రం రామ‌కృష్ణ ఏపీ భవన్‌ లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల భూమిని సేకరించి పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 13 జిల్లాలలో బ‌ల‌వంతంగా భూములను తీసుకొంటున్న చంద్ర‌బాబు స‌ర్కారు తీరును చూస్తుంటే బాబుకు భూమి పిచ్చిప‌ట్టిన‌ట్లుగా అనిపిస్తోంద‌ని రామ‌కృష్ణ మండిప‌డ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ తో సహా కలిసి వచ్చే ఇతర పార్టీలతో కూడా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా రామ‌కృష్ణ ప్ర‌క‌టించారు. త‌ద్వారా చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై తగిన బుద్ధి చెబుతామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ నాయకులు రాజీనామా చేసి గెలవాలని ఆయ‌న సవాలు విసిరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News