కలిసి పోరాడదామని పవన్ ను పిలుస్తున్నాడు..!

Update: 2015-07-13 02:34 GMT
ప్రజారాజ్యంతో తొలి దశ లో రాజకీయాలు చేసి.. రెండో దశలో జనసేన పార్టీతో రాజకీయాల వైపుకు వచ్చాడు పవన్ కల్యాణ్. తొలి దశలో రాజకీయాలు అంత సఫలం కాలేదు కానీ.. రెండో దశలో మాత్రం పవన్ మంచి ఫామ్ లోనే కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడే అయినా.. ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు.. అభిమానుల్లో కొంత ఉల్లాసం కనిపిస్తోంది. జనసేనకు తాడూ బొంగరం లేకపోయినా.. పవన్ అయితే రాజకీయంగా ఒక శక్తిలా కనిపిస్తున్నాడు. మరి ఈ విధంగా సొంత పార్టీతో రంగంలో ఉండీ లేనట్టుగా ఉన్న పవన్ ను ఒక వ్యక్తి తమ పార్టీ తరపున పోరాడాదమని పిలుస్తున్నాడు.

ఆయనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జనసేన అధ్యక్షుడిని రారమ్మంటూ పిలుస్తున్నాడు రామకృష్ణ. ప్రజాసమస్యల విషయంలో.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా సాధన విషయంలో పవన్ తమతో కలిసి రావాలని రామకృష్ణఅంటున్నాడు. పవన్ ఊరికే ట్వీట్లు పెడితే ప్రయోజనం ఉండదని.. పోరాట బాట పడితేనే ఫలితాలు ఉంటాయని కూడా రామకృష్ణ హితబోధ చేస్తున్నాడు. ఎన్నికల ముందు మోడీకి మద్దతు ప్రకటించిన పవన్ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోడీనే ప్రశ్్నించాలని రామకృష్ణ అంటున్నాడు.

జనసేనను భజనసేనగా మార్చవద్దని.. పవన్ ఒక పార్టీ అధ్యక్ష హోదాలోనే కమ్యూనిస్టు పార్టీలతో కలిసి రావాలని.... అందరం కలిసి పోరాడదామని రామకృష్ణ చెబుతున్నాడు. మరి అవినీతి మకిలి పెద్దగా లేని కమ్యూనిస్టులు ఇలాంటి పిలుపును ఇవ్వడంలో తప్పులేదు. కలిసి పోరాడదాం.. రాష్ట్రానికి అన్నింటినీ సాధించుకొందాం.. మీ శక్తినీ, మాశక్తినీ కలిపి .. మహా శక్తిగా మారదాం.. అని పవన్ ను కోరాడం మంచిదే. మరి ఈ పిలుపు పట్ల జనసేన అధినేత ఎలా స్పందిస్తాడు? అసలు స్పందిస్తాడా?! రామకృష్ణ పిలుపును పట్టించుకొంటాడా? అనే అంశాలకు పవన్ కల్యాణ్ ట్విటర్ అకౌంట్ నుంచినే సమాధానం రావాలి!
Tags:    

Similar News