ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో.. ప్రత్యేకహోదా కోసం పోరాడేస్తాం.. సాధించేస్తాం.. రాష్ట్రానికి రావాల్సిన ప్రతిదీ పోరాడి సాధించి తీసుకువస్తాం అని తెగ బీరాలు పలుకుతున్నారు. ఒకవైపు ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేకహోదా అనే డిమాండు విషయంలో గేరు మారుస్తున్న కొద్దీ.. చంద్రబాబులో వణుకు మొదలవుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రతిసారీ.. మేమే సాధించేస్తున్నాం.. ప్రత్యేకహోదా ఇవ్వకతప్పదు.. ‘అందుకే పోరాట మార్గాన్ని ఎంచుకున్నాం’ వంటి పడికట్టు మాటలను ఆయన వల్లిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా బెజవాడలో.. ప్రభుత్వం వ్యవహరించిన తీరును గమనిస్తే.. ఈ ప్రభుత్వం నడిపే పార్టీనేనా ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో పోరాడేది - సాధించేది అనే అనుమానం ప్రజలకు కలగక మానదు.
బెజవాడలో వామపక్షాలు మంగళవారం నాడు ప్రత్యేక హోదా కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. బందరు రోడ్డులోని ఆల్ ఇండియా రేడియో వద్ద లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో పికెటింగ్ నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ తో కూడిన నినాదాలతో.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా లెఫ్ట్ పార్టీల ఉద్యమం జరుగుతోంటే.. పోలీసులు దానిని అడ్డుకున్నారు.
సిహెచ్ బాబూరావుతో పాటూ సిపిఐ - సిపిఎం నాయకులు 80 మందిని పోలీసులు అరెస్టు చేసి జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఒకవైపు ప్రభుత్వం కూడా కోరుతున్న ప్రత్యేకహోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆల్ ఇండియా రేడియో వద్ద శాంతియుతంగా పికెటింగ్ లు చేస్తూ ఉంటేనే ఇంత అమానుషంగా అరెస్టులు చేసే ప్రభుత్వం.. ఇక ప్రత్యేకహోదా కోసం ఏం పోరాడుతుంది? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
తాము ప్రత్యేకహోదాకోసం పోరాడుతున్నందుకే అరెస్టు చేశారా? ఇక ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను ఏం సాధిస్తుంది..? అంటూ అరెస్టు అయిన తర్వాత.. వామపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. కేంద్రప్రభుత్వానికి చెందిన రేడియోస్టేషన్ వద్ద పికెటింగ్ లు నిర్వహిస్తేనే అరెస్టు చేసే అరాచక ప్రభుత్వం.. ఇక రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఉద్యమిస్తే సహిస్తుందా అంటూ నేతలు ప్రశ్నించడం విశేషం. ఇలాంటి అరెస్టులకు జడిసేది లేదని మరింత ఉధృతంగా పోరాడుతాం అని వారంటున్నారు.
అయినా చంద్రబాబు.. తాను కూడా హోదాకోసం పోరాడుతా అంటున్నారు.. ఆ పద్ధతి ఈ అరెస్టులేనా అని ప్రజలు విమర్శిస్తున్నారు.