అమరావతి:అనధికార లే అవుట్లపై ఉక్కుపాదం

Update: 2015-08-04 09:59 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అనధికార లే అవుట్లపై సీఆర్ డీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత మూడు రోజులుగా వాటిని తొలగిస్తున్నారు. సమీప భవిష్యత్తులో నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అనధికార లే అవుట్లు అనేవి ఉండకుండా పావులు కదుపుతోంది. నిబంధనలను ఉల్లంఘించి వెలసిన వెంచర్లు, లే అవుట్లను ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సీఆర్ డీఏ అధికారులు ధ్వంసం చేశారు.

తాజాగా రాజధానికి సమీపంలోని కృష్ణా జిల్లాలోని మూడు మండలాల్లో ఉన్న అనధికార వెంచర్లను ధ్వంసం చేస్తున్నారు. విజయవాడ గ్రామీణ, మైలవరం, జి.కొండూరు మండలాల్లోనిఐదు గ్రామాల్లో మొత్తం 61 ఎకరాలకుపైగా వేసిన అనధికారిక వెంచర్లను అధికారులు ధ్వంసం చేస్తున్నారు. సీఆర్ డీఏ నిబంధనలను పాటించకుండా వెంచర్లు వేయడంతో అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలతోపాటు వాటి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అనధికార వెంచర్లను అధికారులు ఇప్పటికే తొలగించిన విషయం తెలిసిందే.

సీఆర్ డీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని అనధికారిక లే అవుట్లు, వెంచర్లను, అనుమతి లేని నిర్మాణాలను తొలగించామని, భవిష్యత్తులో వీటిని అసలు అంగీకరించే ప్రసక్తే లేదని, రియల్టర్లు, స్థిరాస్తి సంస్థల ప్రచారంపై ఎవరికైనా అనుమానాలు ఉంటే తమను సంప్రదించి, అనుమానాలను నివృత్తి చేసుకుని కొనుగోళ్లు జరపాలని సీఆర్ డీఏ అధికారులు తేల్చి చెబుతున్నారు.
Tags:    

Similar News