నెటిజన్లకు గుడ్ న్యూస్.. ట్విటర్ లో త్వరలో క్రేజీ ఫీచర్!

Update: 2021-12-07 03:13 GMT
ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ట్విటర్ ఒకటి. మనసులో ఉన్న భావాలను ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా చాలామంది ట్వీట్ చేస్తూ ఉంటారు. వారికి నచ్చిన దాని గురించి లేకపోతే నచ్చని దాని గురించి అయినా ట్వీట్ చేస్తారు. చిన్న పిట్ట ఆకారంలో ఉండే ఈ ట్విటర్ సింబల్ చూడడానికి చాలా మందిని ఆకట్టుకుంటుంది. అయితే దీనిని వేదికగా చేసుకుని ఎంతో మంది ప్రముఖులు వారు చెప్పదలుచుకున్న సమాచారాన్ని ట్వీట్ల రూపంలో చెప్తూ ఉంటారు. మాస్ లెవల్ ఆడియన్స్ ని ఒకే టైం లో చేరుకోవాలి అంటే ట్విటర్ అనేది బెస్ట్ యాప్. దీనిలో అకౌంట్ ఉంటే మనకు కావలసిన వారిని ఫాలో అవ్వవచ్చు. వారి చేసిన పోస్ట్లు, ట్వీట్లు మనకి చూసేందుకు వస్తాయి. కొన్ని కోట్ల మంది మేధావుల ఆలోచనలను అభిప్రాయాలను ట్విటర్ ద్వారా చెప్తుంటారు. అయితే ఇలాంటి ట్విటర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇకపై ట్వీట్లను కేవలం చదవడంతో పాటు ఆడియో రూపంలో వినవచ్చును.

ట్విటర్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఆడియో ట్వీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ట్విటర్ ఇప్పటికే ప్రారంభించింది. అయితే పూర్తి స్థాయిలో ఇవి అందుబాటులోకి రావాలి అంటే మరి కాస్త సమయం పడుతుంది అని ట్విటర్ వెల్లడించింది. తొలుత దీనిని యాపిల్ ఐఫోన్ లలో పరీక్షించనున్నారు. ఈ నిర్ణయం కానీ సక్సెస్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా వీటినీ అందుబాటు లోకి తీసుకుని రావాలని ట్విటర్ యోచిస్తోంది. ఇప్పటికి కేవలం పరీక్షలను ఎదుర్కొంటున్న ఈ ఫీచర్... త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఆడియో ట్వీట్లను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయవచ్చు. ఇందుకుగానూ ట్విట్టర్ లో ఉండే కంపోజ్ అనే ముందుగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఏవైతే ట్రీట్ చేయాలనుకుంటున్నామో.. దానిని పూర్తిగా రికార్డ్ చేయాలి. ఇలా రికార్డైన సందేశాన్ని సాధారణంగా పోస్ట్ చేసినట్టుగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మనం పెట్టిన సందేశం మనల్ని ఫాలో అయ్యే వాళ్లు వినవచ్చు వీటికి సమాధానంగా కూడా వారు రిప్లై ఇవ్వవచ్చు. రిప్లై ట్వీట్ కూడా ఆడియో రూపంలోనే పెట్టవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే చదువు రాని చాలా మంది కూడా ఈ యాప్ ని ఉపయోగించే అవకాశం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ ఆడియో ట్వీట్లపై నియంత్రణ ఎలా చేస్తారు అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. హేట్ స్పీచ్ ల కారణం ఇప్పటికే ఫేస్ బుక్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో దీనిపై ట్వీట్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Tags:    

Similar News